తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ సూపర్ లీగ్​లో టీమ్​ఇండియా స్థానం ఇదే..

శ్రీలంకతో సిరీస్​లో భాగంగా తొలి వన్డేను గెలుచుకున్న టీమ్ఇండియా.. వన్డే ప్రపంచకప్​ సూపర్​ లీగ్​ (ICC Super League)లో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్​లో ఓటమి పాలైన లంక జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

icc Cricket World Cup Super League, team india
టీమ్ఇండియా, వన్డే ప్రపంచకప్​ సూపర్ లీగ్

By

Published : Jul 19, 2021, 6:20 PM IST

తొలిసారి నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్​ సూపర్​ లీగ్​ (ICC Super League)లో టీమ్ఇండియా ఐదో స్థానానికి చేరుకుంది. తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ధావన్​ సేన.. 39 పాయింట్లతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్​లో ఓడిన శ్రీలంక 13 పాయింట్లతో పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

ఐదో స్థానంలో భారత్

ఈ లిస్టులో ఇంగ్లాండ్​ 95 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మొత్తం 15 మ్యాచ్​లాడిన ఇంగ్లాండ్​ 9 విజయాలు నమోదు చేసింది. ఇక జింబాబ్వేతో సిరీస్​లో భాగంగా తొలి రెండు వన్డేలను గెలుచుకున్న బంగ్లాదేశ్​.. 70 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఏంటీ సూపర్​ లీగ్​..

2023 వన్డే ప్రపంచకప్‌ అర్హత కోసం 2020 జులై 30న ఈ సూపర్​ లీగ్​ను ప్రారంభించింది ఐసీసీ. ఇందులో భాగంగా తొలి మ్యాచ్​ సౌంథాప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​, ఐర్లాండ్​ మధ్య జరిగింది. ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు నెదర్లాండ్స్​​ ఈ​ లీగ్​లో పాల్గొంటున్నాయి. ప్రతి జట్టు స్వదేశంలో మూడు సిరీస్​లు, విదేశాల్లో మూడు సిరీస్​లు ఆడాల్సి ఉంటుంది.

ఈ సూపర్​ లీగ్​ ద్వారా భారత్​లో జరిగే 2023 ప్రపంచకప్​ అర్హత జట్లను నిర్ణయించనున్నారు. వన్డే ర్యాంకింగ్స్​లో తొలి 7 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్​కు అర్హత సాధిస్తాయి. మిగిలిన టీమ్​ల అర్హత కోసం ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:కెప్టెన్సీ ఛేంజ్​.. ఇది మీరు గమనించారా!

ABOUT THE AUTHOR

...view details