తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'గా హర్మన్​.. పురుషుల్లో అవార్డు అతడికే.. - పేయర్ ఆఫ్ ది మంత్ హర్మన్ ప్రీత్

'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డులను ఐసీసీ ప్రకటించింది. పురుషులు, మహిళల జట్ల నుంచి అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్లను అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డులు గెలిచిన ప్లేయర్లు బంగారు పతకాలను అందుకోనున్నారు.

icc player of the month awards
icc player of the month awards

By

Published : Oct 10, 2022, 5:07 PM IST

పురుషులు, మహిళల 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డులను ఐసీసీ ప్రకటించింది. పురుషుల్లో సెప్టెంబర్​ నెలకు గాను పాకిస్థాన్​కు చెందిన ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్​ ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. మహిళలల్లో టీమ్​ ఇండియా ప్లేయర్ హర్మన్​ప్రీత్​కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డులు గెలిచిన ఇద్దరు ప్లేయర్లు.. ఐసీసీ నుంచి గోల్డ్​ మెడళ్లు అందుకోనున్నారు.

ఇటీవల.. టీమ్ ఇండియా కెప్టెన్​గా, బ్యాటర్​​గా అద్భుతంగా రాణించింది హర్మన్​. ఇంగ్లాండ్​తో ఆడిన మూడు వన్డేల సిరీస్​ను 3-0 తేడాతో క్లీన్​ స్వీప్​ చేసింది టీమ్ ఇండియా. 1999 తర్వాత ఇంగ్లాండ్​పై భారత్​ సిరీస్​ గెలవడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్​లో 103.27 స్ట్రైక్​ రేట్​తో 221 పరుగులు చేసింది హర్మన్.

'ఈ అవార్డుకు నామినేట్​ అవ్వడం, ఆ అవార్డు నాకు దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వకారణం. అలాగే ఇంగ్లాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో గెలవడం నాకు మరచిపోలేని అనుభూతి' అని అవార్డు వచ్చిన సందర్భంగా హర్మన్​ ప్రీత్​ చెప్పింది.

పురుషుల్లో రిజ్వాన్..
టీ20ల్లో పరుగులు వేట కొనసాగిస్తున్న పాక్ బ్యాటర్ మహ్మద్​ రిజ్వాన్.. సెప్టెంబర్ నెలకు ప్లేయర్​ అఫ్​ ది మంత్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగా రిజ్వాన్​ మాట్లాడాడు. 'ఈ విజయానికి కారణం మా టీమ్ ప్లేయర్లు. ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. నేను నా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆస్ట్రేలియాలో జరగబోయే వరల్డ్​కప్​లో ఇంకా మంచి ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను. ఈ అవార్డును వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పాకిస్థాన్​ ప్రజలకు అంకితమిస్తున్నాను. ఈ అవార్డు వారి ముఖలపై చిరునవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నాడు.

సెప్టెంబర్​లో రిజ్వాన్ 10 టీ20 మ్యాచ్​లు ఆడాడు. అందులో 7 అర్ధ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్​తో ఆడిన 7 మ్యాచ్​ల టీ20 సిరీస్​లో.. మొదటి ఐదు మ్యాచ్​ల్లో 60 పైగా స్కోర్​ చేశాడు రిజ్వాన్.

ABOUT THE AUTHOR

...view details