ICC T20 World Cup 2022 : వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీంతో ఆ మెగా టోర్నీ పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివిధ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు వాళ్ల మెగా టోర్నీ జట్లను ప్రకటిస్తున్నాయి. కంగారూ గడ్డపై సమరానికి సిద్ధమవుతున్నాయి. వరల్డ్ కప్ లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ వాతావరణాన్ని మరింత వేడెక్కించేందుకు.. ఐసీసీ గెలిచిన వారికి ప్రైజ్ మనీ వివరాలు ప్రకటించింది.
వరల్డ్ కప్ గెలిచిన వారికి 1.6 మిలియన్ యూఎస్ డాలర్లు(13.05 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు తెలిపింది. రన్నరప్ జట్టు అందులో సగం ప్రైజ్ మనీ అందుకుంటుంది. సెమీ ఫైనల్ ఓడిపోయిన వారికి 4 లక్షల యూఎస్ డాలర్లు(3.26 కోట్లు) చొప్పున ఇవ్వనుంది. సూపర్ 12 స్టేజ్ నుంచి బయటకు వెళ్లిన వారికి 70 వేల యూఎస్ డాలర్లు(57.07 లక్షలు) ఇవ్వనుంది.
టీ20 ప్రపంచకప్-2022 ప్రైజ్‌మనీ వివరాలు
- విజేత- 1,600,000 డాలర్లు ( భారత కరెన్సీలో సుమారుగా 13 కోట్ల ఐదు లక్షలు)
- రన్నరప్- 800,000 డాలర్లు (దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు)
- సెమీ ఫైనల్లో ఓడిన 2 జట్లు- 800,000 డాలర్లు(ఒక్కో జట్టుకు 400,000 డాలర్లు- సుమారు 3,26,20,220 రూపాయలు)
- సూపర్-12 దశలో గెలిచిన జట్లు- 1,200,000 డాలర్లు(ఒక్కో మ్యాచ్‌కు 40,000 డాలర్లు)
- సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు
- ఫస్ట్‌రౌండ్లో గెలిచిన జట్లు - 480,000 డాలర్లు
- ఫస్ట్‌రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు