తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్​ ఒకడు' - సంజయ్ మంజ్రేకర్ అశ్విన్

టెస్టుల్లో ఉన్న మేటి బౌలర్లలో టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​ ఒకడని తెలిపాడు ఆసీస్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్. అశ్విన్​ను ఆల్​టైమ్​ గ్రేట్​గా పరిగణించలేమన్న సంజయ్​ మాటలకు బదులుగా ఛాపెల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందించాడు.

ian chappell, fomer australia cricketer
ఇయాన్ ఛాపెల్, ఆసీస్ మాజీ క్రికెటర్​

By

Published : Jun 6, 2021, 8:00 AM IST

ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడుతోన్న అత్యుత్తమ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్ అన్నాడు. అశ్విన్​ను ఆల్​టైమ్ గ్రేట్​గా పరిగణించలేమని సంజయ్ మంజ్రేకర్ అన్నప్పుడు.. జోయల్ గార్నర్ గురించి ప్రస్తావించాడు ఛాపెల్.

ఓ క్రీడా కార్యక్రమంలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. "ఆశ్విన్​ను ఆల్​టైమ్ గ్రేట్ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారైనా అయిదు వికెట్ల ఘనత సాధించలేదు. సొంతగడ్డపై తనకు అనుకూలమైన పిచ్​లపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా గత నాలుగేళ్లుగా వికెట్ల వేటలో జడేజా అతడితో పోటీపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో సిరీస్​లో స్పిన్ పిచ్​లపై అక్షర్ పటేల్ అతడికన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. ఆశ్విన్​ను నిజమైన ఆల్​టైమ్ గ్రేట్​గా పరిగణించడంలో ఇవే నాకున్న ఇబ్బందులు" అని అన్నాడు.

ఇదీ చదవండి:WTC Final: 'అలాంటివే ఈ మ్యాచ్​కు మరింత ప్రత్యేకం'

అయితే మంజ్రేకర్ అభిప్రాయంతో ఛాపెల్ ఏకీభవించలేదు. "జోయల్ గార్నర్ ఎన్నిసార్లు అయిదు వికెట్ల ఘనత సాధించాడు? మంచి రికార్డున్నా.. ఎక్కువసార్లేమీ అతడు అయిదు వికెట్లు చేజిక్కించుకోలేదు. ఎందుకంటే అతడు మరో ముగ్గురు అత్యుత్తమ బౌలర్లతో కలిసి బౌలింగ్ చేశాడు. కొన్నేళ్లుగా భారత బౌలింగ్ బలంగా ఉంది. బౌలర్లు ఎక్కువసార్లు వికెట్లు పంచుకుంటున్నారు. అశ్విన్ ప్రధాన బౌలర్ అని తెలియడం వల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ అతడిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటారు. అక్షర్ గురించి వాళ్ల కెలాంటి అవగాహనా లేదు" అని ఛాపెల్ చెప్పాడు.

ఇదీ చదవండి:IND VS SL: 'భారత జట్టు గెలిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details