Ian chappell IND Vs Southafrica test series: యువ క్రీడాకారుల్లో ఉన్న టాలెంట్‌ను గుర్తించగలిగే సెలక్టర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ సూచించాడు. దీనికి ఉదాహరణగా దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్ ఎంపికను పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సఫారీల జట్టు గెలుచుకోవడంలో పీటర్సన్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగపూరితమైన సంఘటనలూ చోటు చేసుకున్నాయని, ఇదే యాషెస్ సిరీస్‌లో కొరవడిందని ఛాపెల్ పేర్కొన్నాడు.
"భారత్‌ను దక్షిణాఫ్రికా ఓడించడం ఆశ్చర్యకరంగా ఉంది. అంతేకాకుండా ఇరు జట్ల ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపించింది. అయితే ఇదే యాషెస్ సిరీస్‌లో లోపించింది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు రాకపోవడం కూడా సర్‌ప్రైజ్‌గా ఉంది" అని వివరించాడు. యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0 ఆధిక్యంతో ఇంగ్లాండ్‌పై గెలిచి కైవసం చేసుకుంది.