ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచేందుకు తనవంతు కృషి చేస్తానని సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెబుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో తానూ ఒకడినని అంటున్నాడు. సరైన దేహదారుఢ్యంతో ఉండేందుకు ఎంతో కృషి చేస్తానని, విరాట్ కోహ్లీ అందరికీ ప్రేరణనిచ్చాడని వెల్లడించాడు.
''అవును, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని. కానీ నేనిక్కడితోనే ఆగిపోను. నిరంతరం నా ఆట, ఫిట్‌నెస్‌పై శ్రమిస్తాను. ఇందుకోసం నేను విపరీతంగా భుజాల కసరత్తులు చేస్తాను. తరచూ పరుగెత్తుతాను. అలా కష్టపడతాను కాబట్టే ఫీల్డింగ్ బాగుంటుంది''
- రవీంద్ర జడేజా
విరాట్ కోహ్లీ మైదానంలో ఉత్సాహంగా ఉంటాడని జడ్డూ అన్నాడు. అతడెంతో దృఢంగా, చైతన్యంతో ఉంటాడని వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ను అతడు ఎక్కువగా విశ్వసిస్తాడని అందువల్లే జట్టులో అంతా తమ ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచుకున్నారని అన్నాడు. ప్రతి ఒక్కరు శారీరకంగా శ్రమిస్తున్నారు కాబట్టే మైదానంలో ఇప్పుడు తేడా కనిపిస్తోందని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: పెళ్లి తర్వాత రోహిత్లో ఇంత మార్పా?