Shoaib Akthar Ponting: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.
Perth 1999 Test: ఆసీస్ పర్యటనలో పాక్ అప్పటికే 0-2తో వెనుకబడి ఉందని, మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై బౌన్సర్లతో విరుచుకుపడాలని నిర్ణయించుకున్నానని అక్తర్ తెలిపాడు. ముందుగా పాంటింగ్‌ను టార్గెట్ చేశానని, అయితే ఆ సమయంలో పాంటింగ్ కాకుండా ఏ ఇతర ఆటగాడు క్రీజులో ఉన్నా బంతితో తల పగులగొట్టేవాడినని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు అక్తర్.
"2005 ఆసీస్ పర్యటనలో జస్టిన్ లాంగర్‌తో గొడవ జరిగింది. మాథ్యూ హేడెన్‌తో కూడా కొట్టుకునేంత చిన్నపాటి ఘర్షణ జరిగింది. నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నా ఆటిట్యూడ్ ఆసీస్ జట్టు ఆటగాళ్లందరికీ నచ్చేది. ప్రస్తుత ఆసీస్ ఆటగాళ్లకు అంత దూకుడు లేదు."