Kohli Ricky ponting: ఫామ్‌లో లేని కోహ్లీని జట్టులో నుంచి తప్పించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతుంటే.. మరికొందరేమో ఉండాల్సిదేనని సూచించారు. విరాట్ ఫామ్‌లో లేకపోయినా అతడొక గేమ్ ఛేంజర్ అని.. టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాల్సిందేనని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణీ చెప్పాడు. తాజాగా ఇలాంటి అభిప్రాయాన్నే ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ కూడా వెల్లడించాడు. జట్టు మేనేజ్‌మెంట్ తప్పకుండా విరాట్‌కు చోటు కల్పించాలని సూచించాడు. కోహ్లీలాంటి స్టార్ బ్యాటర్ భారత్‌తో ఉంటే ఆడటానికి తాను కూడా భయపడతానని పేర్కొన్నాడు. ఇప్పటికీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపగలడని తెలిపాడు. ప్రపంచకప్ పోటీల్లో విరాట్ కోహ్లీ కోసం టాప్‌ఆర్డర్‌లో స్థానం వదిలిపెట్టాలని టీమ్‌ఇండియా సెలెక్షన్ కమిటీకి పాంటింగ్ సూచించాడు.
కోహ్లీ ఉన్న జట్టు అంటే నాకు భయం: రికీ పాంటింగ్ - t20 worldcup updates
Kohli Ricky ponting: కోహ్లీ ఉన్న టీమ్ఇండియాతో తాను ఆడేందుకు భయపడతానని చెప్పాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్. విరాట్‌ను కాదని ప్రపంచకప్ టీమ్‌లోకి వేరొకరిని తీసుకుంటే.. మళ్లీ జట్టులోకి రావడం అతడికి కష్టమవుతుందని అన్నాడు.
"ప్రత్యర్థి ఆటగాడిగా, సారథిగా నేనైతే కోహ్లీతో కూడిన టీమ్‌తో ఆడేందుకు కాస్త జంకుతా. అయితే ఫామ్ కోల్పోవడంతో ప్రస్తుతం అతడికి గడ్డుకాలంగా మారింది. ఎంతటి పెద్ద ఆటగాడైనా ఓ దశకు చేరుకున్నాక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. అయితే అత్యుత్తమ ఆటగాళ్లు గాడిలో పడటానికి మార్గాలను అన్వేషించి ఉవ్వెత్తున లేస్తాడు. కానీ విరాట్ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కొంత సమయం మాత్రమే ఉంది. ఒకవేళ కోహ్లీని కాదని ప్రపంచకప్ టీమ్‌లోకి వేరొకరిని తీసుకుంటే.. మళ్లీ జట్టులోకి రావడం విరాట్‌కు కష్టమవుతుంది. నేనేగనుక భారత్‌లో ఉండుంటే నా మద్దతు కోహ్లీకే ఇచ్చేవాడిని. అతడికి చేదోడుగా ఉంటాను. కోహ్లీ తిరిగి రావాలని టీమ్‌ఇండియా యాజమాన్యం నిజంగా కోరుకుంటే నమ్మకం కలిగించాలి. భారత కోచ్‌గా లేకపోతే కెప్టెన్‌గా ఉంటే మాత్రం కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేవరకు వేచి ఉంటాను" అని రికీ పాంటింగ్ వివరించాడు.
ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ స్పెషల్ టూర్.. ఫొటోస్ అదిరాయిగా