కెరీర్లో ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డెయిల్ స్టెయిన్(Dale steyn wickets).. తాను విజయవంతమైన బౌలర్‌గా ఎదగడానికి కారణాన్ని వివరించాడు. కెరీర్లో తాను ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ భారత స్టార్ క్రికెటర్ సచిన్‌ను(dale steyn vs sachin tendulkar) ఎలా ఎదుర్కొనేవాడో తెలిపాడు. అతడు లిటిల్ మాస్టర్‌కు బౌలింగ్ వేసేటప్పుడు ఎందుకు సింగిల్ ఇచ్చేవాడో వెల్లడించాడు.
"ఓ ఫాస్ట్ బౌలర్‌గా రోజంతా వేగంగా బౌలింగ్ చేయాలనుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో బలమైన బ్యాట్స్‌మన్ బ్యాటింగ్‌కు దిగుతాడు. అప్పుడు వారిని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో ఎక్కువగా ఆలోచించకూడడు. శక్తిని వృథా చేయకూడదు. నాన్‌స్ట్రైక్ ఎండ్ బ్యాట్స్‌మన్‌పై దృష్టి పెట్టాలి. వారిని లక్ష్యం చేసుకుని ఆడాలి. అప్పుడు తమను తాము కాపాడుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తుంటారు. నా ఆటలో ఇదే సూత్రాన్ని పాటించా. బాగా ఆడే బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడం కోసం ఎక్కువ కష్టపడటంలో అర్థం లేదు. అందుకే బలహీనంగా ఆడేవారిని లక్ష్యం చేసుకుని ఒకరి తర్వాత మరొకటి వికెట్లు తీస్తుంటా. అందుకే కెరీర్లో విజయవంతమైన బౌలర్‌గా కొనసాగా. సచిన్ విషయంలోనూ ఇదే చేశా. మరొక బ్యాట్స్‌మన్‌కు బ్యాటింగ్‌కు రప్పించేందుకు సచిన్‌కు సింగిల్ ఇచ్చేవాడిని."
-స్టెయిన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.