Ramiz Raja IPL: ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై (ఐపీఎల్) పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్) వచ్చే సీజన్ నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, అప్పుడు ఐపీఎల్‌కు ఎవరు వెళ్తారో చూస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విమర్శలు రావడంతో.. తాజాగా రమీజ్ రాజా స్పందించాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాను అలా అనలేదని అన్నాడు.
''భారత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, పాక్ ఆర్థిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. పీఎస్ఎల్ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మా వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామనుకున్నాం. అంతేకానీ.. నా వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.''
- రమీజ్ రాజా, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్