తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరిన్ని టెస్టులు ఆడాలని ఉంది: హర్మన్​ప్రీత్​ - ఇంగ్లాండ్​ Vs ఇండియా

ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు మ్యాచ్​ కోసం తామెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు టీమ్ఇండియా మహిళా జట్టు టీ20 కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ తెలిపింది. సుదీర్ఘ ఫార్మాట్​ సవాలుతో కూడుకున్నా.. ఉల్లాసాన్ని కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడింది. తన కెరీర్​లో మరిన్ని టెస్టు మ్యాచ్​లు ఆడాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

I want to play many Test matches in my life, Says Harmanpreet Kaur
మరిన్ని టెస్టులు ఆడాలని ఉంది: హర్మన్​ప్రీత్​

By

Published : Jun 4, 2021, 6:57 AM IST

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా మహిళా జట్టు టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టెస్టు మ్యాచ్‌ ఆడటం సవాలుతో కూడుకున్నదైనా.. ఉల్లాసాన్ని కూడా కలిగిస్తోందని కౌర్‌ పేర్కొంది. జూన్‌ 16న బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మహిళా జట్ల మధ్య ఏకైక టెస్టు ప్రారంభం కానుంది.

"ఇది గొప్ప అనుభూతి. టెస్టు మ్యాచ్‌ ఆడడం నా కల. నేను నా జీవితంలో మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. దీన్ని ఇదేవిధంగా కొనసాగిస్తాననే నమ్మకం నాకుంది. ఎర్ర బంతితో ఇంగ్లాండ్‌లో ఆడడం సవాల్‌తో కూడుకున్నది. మేమందరం దీనికోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం."

- హర్మన్​ప్రీత్​ కౌర్​, భారత మహిళా క్రికెటర్​

కౌర్‌ ఇప్పటివరకు భారత్ తరఫున రెండు టెస్టులు ఆడగా, 104 వన్డేలు ఆడి 2,532 పరుగులు సాధించింది. ఇక, 114 టీ20ల్లో 2,186 పరుగులు చేసింది. ఇదే జోరును సుదీర్ఘ ఫార్మాట్‌ క్రికెట్‌లోనూ కొనసాగించాలని కౌర్‌ భావిస్తోంది.

ఇంగ్లాండ్‌ ఏకైక టెస్టు ముగిసిన అనంతరం అదే జట్టుతో భారత మహిళా జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇప్పటికే భారత పురుషుల జట్టుతో పాటు మహిళా జట్టు గురువారం ఇంగ్లాండ్‌ చేరుకుంది.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరులో కోహ్లీసేనతో న్యూజిలాండ్ తలపడనుంది. అనంతరం టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది.

ఇదీ చూడండి:'మహిళా క్రికెట్​కు మీడియా మద్దతు అవసరం'

ABOUT THE AUTHOR

...view details