టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్ తంగరసు నటరాజన్ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు నట్టూ. ఏప్రిల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు.
'గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నా' - మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న నట్టూ
మోకాలి శస్త్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా బౌలర్ నటరాజన్. ఇన్‌స్టా వేదికగా తన ఆరోగ్యం గురించి పలు విషయాలు వెల్లడించాడు.
నటరాజన్, టీమ్ఇండియా బౌలర్
గత నెలలో మోకాలి సర్జరీ అనంతరం తొలిసారి స్పందించాడు నటరాజన్. వీలైనంత త్వరలో ఫిట్‌గా తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతనికి బీసీసీఐతో పాటు ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి.