టీమ్ఇండియాకు కెప్టెన్‌గా విరాట్‌ను ఎంపికచేసినప్పుడు తాను భయపడ్డానని పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వెల్లడించాడు. బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న అతడు సారథిగా విఫలమైతే అభిమానులు విమర్శించే అవకాశం ఉందని భావించినట్టు తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీ భార్య అనుష్కకు కూడా చెప్పినట్టు పేర్కొన్నాడు.
"బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న తొలినాళ్లలోనే కోహ్లీపై కెప్టెన్సీ భారం మోపారు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టి తప్పు చేశాడని ఓ షోలో అతడి భార్య అనుష్కకు కూడా చెప్పా. సారథ్య బాధ్యతల వల్ల అతడిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని వివరించా. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే దేశంలో నాయకుడిగా విఫలమైతే అతడిపై విమర్శలు వచ్చే ప్రమాదం ఉందనుకున్నా. అయినప్పటికీ ఇవన్నీ చాలా చాకచాక్యంతో అధిగమించాడు విరాట్" అని అక్తర్ తెలిపాడు.