తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ విషయం నా చేతుల్లో లేదు: విజయ్ శంకర్ - క్రికెట్ న్యూస్

ఎంతో మంది టీమ్​ఇండియా క్రికెటర్ల కన్నా తాను మెరుగైన ప్రదర్శన చేసినట్లు విజయ్ శంకర్ చెప్పాడు. బాగా పరుగులు చేస్తున్నప్పటికీ తనను జట్టులోకి తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు .

cricket news
విజయ్ శంకర్

By

Published : May 14, 2021, 8:00 PM IST

Updated : May 14, 2021, 8:32 PM IST

టీమ్ఇండియాలో చోటు దక్కించుకునే విషయమై చాలా మంది కన్నా తాను మెరుగైన ప్రదర్శన చేసినట్లు వెల్లడించాడు భారత క్రికెటర్ విజయ్ శంకర్. జట్టులోకి పునరాగమనం తన చేతుల్లో లేదని అన్నాడు. 2019 ప్రపంచకప్ తర్వాత అతడికి జట్టులో చోటు దక్కలేదు. అయితే కేవలం అల్ రౌండర్ అనే కారణంగా తనను జట్టులోకి తీసుకోవడం లేదని శంకర్ చెప్పాడు.

విజయ్ శంకర్

"కేవలం.. నేను ఆల్ రౌండర్ అనే కారణంతో జట్టులో ఉండాలని కోరుకోవడం లేదు. నా సామర్థ్యంపై నమ్మకం ఉన్నప్పుడే జట్టులోకి నన్ను తీసుకోవాలి. ఎంతో మంది కన్నా నేను మెరుగ్గా రాణించాను"

- విజయ్ శంకర్, టీమ్ ఇండియా బ్యాట్స్ మన్

మంచి ప్రదర్శన చేసిన సమయంలోనూ తనను జట్టులోకి తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు శంకర్. మరోసారి టీమ్ఇండియా జెర్సీ ధరించడానికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నాడు.

ఇదీ చూడండి:'ఆ విషయంలో స్పందించేందుకు మాటలు రావట్లేదు'

Last Updated : May 14, 2021, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details