తెలంగాణ

telangana

ETV Bharat / sports

2007 ప్రపంచకప్​ ఫైనల్​లో అందుకే ఔటయ్యా: మిస్బా

Misbah-ul-Haq 2007 worldcup: 2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో తమ జట్టును గెలుపు అంచువరకు తీసుకెళ్లి అనూహ్య రీతిలో ఔట్​ అయ్యాడు పాక్​ మాజీ ఆటగాడు మిస్బా ఉల్​హక్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తాను ఆ సమయంలో ఎందుకు ఔట్ కావాల్సి వచ్చిందో వివరించాడు. ఆత్మవిశ్వాసం ఎక్కువై వికెట్​ పోగొట్టుకున్నానని అన్నాడు.

Misbah-ul-Haq 2007 worldcup
మిస్బా ఉల్​ హక్​ 2007 ప్రపంచకప్​

By

Published : Jan 29, 2022, 1:16 PM IST

Updated : Jan 29, 2022, 1:57 PM IST

Misbah-ul-Haq 2007 worldcup: అది 2007 సెప్టెంబరు 24. దక్షిణాఫ్రికా వాండరర్స్​ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్​ టోర్నీ ఫైనల్​. ఆ రోజును క్రికెట్​ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఎంతో ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్​ చివరి ఓవర్​లో గెలుపు దోబూచులాడి చివరకు భారత్​కు వరించింది. నిజానికి పాక్​ బ్యాటర్​ మిస్బా ఉల్​ హక్ అదిరిపోయే ఇన్నింగ్స్​ ఆడి విజయానికి చాలా దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే అనూహ్య రీతిలో తన ఫేవరెట్​ స్కూప్​​ షాట్​​ ఆడి ఔట్​ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఆ టీ20 టోర్నీలో తాను ఔటైన తీరుపై స్పందించాడు. అత్మవిశ్వాసం ఎక్కువై ఔటైనట్లు వివరించాడు.

"2007లో ప్రతి మ్యాచుల్లో స్కూప్​ షాట్​తో ఎన్నో ఫోర్లు బాదాను. ఆస్ట్రేలియాపై కూడా ఆ షాట్​తో బాగా ఆడాను. స్పిన్నర్లపై మంచి ప్రదర్శన చేశాను. కానీ ఫైనల్​లో ఆ బంతి బాదేటప్పుడు నాలో ఆత్మవిశ్వసం ఎక్కువైంది. దీంతో బంతిని కొట్టే టైమింగ్​ తప్పింది. అందుకే ఔట్​ అయ్యాను" అని మిస్బా చెప్పాడు.

157 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్​ తడబడింది. షాహిద్​ అఫ్రిది, యూనిస్​ ఖాన్​, మాలిక్ వంటి దిగ్గజ బ్యాటర్లను టీమ్​ఇండియా బౌలర్లు త్వరగా పెవిలియన్​ చేర్చారు. కానీ మిస్బా ఉల్​ హక్​ మాత్రం ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి విజయానికి చాలా దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక పాక్​ గెలుపు ఖాయమని అభిమానులు భావించారు. ఆ జట్టుకు చివరి ఓవర్లో 13 పరుగలు మాత్రమే అవసరం. ఆ ఓవర్​లో జోగిందర్​ శర్మ వేసిన రెండో బంతిని సిక్సర్​గా మలిచి భారత్​ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక మూడో బంతికి స్కూప్​ షాట్​ ఆడబోయి శ్రీశాంత్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. దీంతో భారత్​ ఐదు పరుగుల తేడాతో గెలిచింది.

Last Updated : Jan 29, 2022, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details