క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టేలర్ ఆ పదవిపై కీలక వ్యాఖ్యలు చేసింది. టీ10 లీగ్ నేపథ్యంలో టీమ్ అబుదాబికి అసిస్టెంట్ కోచ్ బాధ్యతలు స్వీకరించిన సారా.. ఫ్రాంచైజీ క్రికెట్‌కు సేవలందించే చివరి మహిళ తాను కాకూడదని పేర్కొంది.
"ఓ అడుగు ముందుకేశామని ఆశిస్తున్నా. మహిళలకు ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలి. ఇలాంటి బాధ్యతలు ఆడవారికి అప్పగించాలని భావిస్తున్నా. నన్ను కోచ్లానే చూడాలి. మహిళా కోచ్‌లా కాదు. ఈ పదవి దక్కడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎప్పుడెప్పుడు అబుదాబికి వెళ్లాలా అని వేచి చూస్తున్నా. మంచి కోచ్‌గా రాణిస్తా."
-సారా టేలర్, టీమ్ అబుదాబి అసిస్టెంట్ కోచ్.