భద్రతా పరమైన కారణాలే కాకుండా ఇరు దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధ వాతావరణం వల్ల కొంతకాలంగా భారత్-పాకిస్థాన్(ind vs pak 2021) మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదు. కేవలం ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో మాత్రమే ఇరుజట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య సిరీస్(ind vs pak 2021) జరగాలని చాలాకాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ఇటు భారత క్రికెట్ బోర్డు, అటు పాక్ బోర్డు రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(abdul razzaq news).. భారత జట్టుపై విమర్శలు చేశాడు. పాక్‌తో టీమ్ఇండియా సరితూగదంటూ కామెంట్లు చేశాడు.
"పాకిస్థాన్ జట్టులో ఉన్నట్లు భారత జట్టులో ఆల్‌రౌండర్లు, పేసర్లు ఉన్నారా? ఈ విషయంలో రెండు జట్ల మధ్య అసలు పోలికే లేదు. నాకు తెలిసి పాక్‌తో భారత్ పోటీపడలేదు. పాక్ ఆటగాళ్ల సామర్థ్యం భారత్‌తో పోలిస్తే భిన్నమైంది. అందుకే వారు పాక్‌తో సిరీస్‌లో పోటీపడరు. పాక్‌లాంటి జట్టును తయారు చేయడం కోసం భారత్ ప్రయత్నిస్తోంది."
-అబ్దుల్ రజాక్, పాక్ క్రికెటర్
దీంతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లపైనా కామెంట్లు చేశాడు రజాక్. దిగ్గజ ఆటగాళ్లు పాక్‌లోనే ఎక్కువగా ఉన్నారంటూ మాట్లాడాడు.
"భారత్ కూడా గొప్ప జట్టే. వారికి కూడా గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ శక్తి సామర్థ్యాల ప్రకారం చూస్తే పాక్‌కు ఇమ్రాన్ ఖాన్ ఉండగా.. భారత్‌కు కపిల్ దేవ్ ఉన్నాడు. వీరిద్దరిలో ఇమ్రాన్ కాస్త ఉత్తమం. మాకు వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. కానీ అతడి సత్తాతో పోల్చదగిన బౌలర్ భారత్‌లో లేడు. మాకు మియాందాద్ ఉంటే వారికి గావస్కర్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య అసలు పోలికే లేదు. మాకు ఇంజమామ్, యూసఫ్, యూనిస్ ఉంటే వారికి ద్రవిడ్, సెహ్వాగ్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పాక్ అత్యుత్తమ క్రికెటర్లను అందించింది. అందుకే పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ ఇష్టపడదు" అంటూ వ్యాఖ్యానించాడు రజాక్.
గత 11 ఏళ్లలో భారత్-పాక్ 20సార్లు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో తలపడగా అందులో 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది టీమ్ఇండియా.త్వరలోనే టీ20 ప్రపంచకప్(T20 world cup 2021)లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.