తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు'

టీమ్​ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) తొలిసారిగా భారత్​ తరఫున ఆడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు సంపాదించిన ఇతడు ఈ విధంగా స్పందించాడు.

varun chakravarthy
వరుణ్ చక్రవర్తి

By

Published : Sep 10, 2021, 1:38 PM IST

యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ జరగనున్న నేపథ్యంలో భారత జట్టులో చోటు సంపాదించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy News). జట్టుకు ఎంపికైన ఐదుగురు స్పిన్నర్లలో వరుణ్ ఒకడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఆకాశ్​ చోప్రాతో మాట్లాడిన వరుణ్​.. ఐపీఎల్​లో ఆడటానికి, టీమ్​ఇండియాకు ఆడటానికి చాలా తేడా ఉందని అన్నాడు. తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు.

"తొలిసారి టీమ్​ఇండియా తరఫున ఆడిన తర్వాత రోజు నిద్ర పట్టలేదు. అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. ముందు రోజు కూడా నిద్రపోలేదు. టీమ్​ఇండియాలో ఆడటం ప్రత్యేక అనుభవం. బాధ్యతగా ఆడాలనే విషయం నాకు బాగా గుర్తొచ్చేది."

-వరుణ్ చక్రవర్తి, టీమ్​ఇండియా స్పిన్నర్.

శ్రీలంకలో జరిగిన టీ20 సిరీస్​లో టీమ్​ఇండియా తరఫున తొలిసారిగా ఆడాడు వరుణ్ చక్రవర్తి. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.

ఇదీ చదవండి:

T20 Worldcup: 'ప్రపంచకప్​లో అఫ్గాన్ ఆడటం కుదరదు'

ABOUT THE AUTHOR

...view details