ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదిగిన భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యా(Hardik Pandya News) ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను అనుకోకుండా ఆల్‌రౌండర్‌గా మారానని పేర్కొన్నాడు. ఇటీవల మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌తో కలిసి హార్ధిక్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో 'నువ్వు ఆల్‌రౌండర్‌గా ఎలా మారావు?'అని కపిల్ దేవ్(Hardik Pandya Kapil Dev) ప్రశ్నించగా.. హార్ధిక్ ఈ విధంగా స్పందించాడు.
"మొదట నేను బ్యాట్స్‌మెన్‌ని. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని. అయితే, అండర్-19 మ్యాచులు ఆడుతున్నప్పుడు బౌలర్లకు భారం తగ్గించేందుకు అప్పుడప్పుడు బౌలింగ్ చేసేవాడిని. ఒకరోజు కిరణ్ మోరె అకాడమీలో ఆడుతున్పప్పుడు కోచ్ సనత్ కుమార్ సర్ దూరం నుంచి గమనించాడు. మరుసటి రోజు దగ్గరికి వచ్చి బౌలింగ్ చేయమన్నారు. అప్పటికి నాకు షూ కూడా లేవు. వేరేవాళ్లవి వేసుకుని బౌలింగ్ చేశా. మొదటి సారే 5 వికెట్లు పడగొట్టడం వల్ల.. తర్వాతి మ్యాచుల్లో కూడా బౌలింగ్ కొనసాగించమన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే రంజీ జట్టుకు ఎంపికయ్యా. అలా అనుకోకుండా అదృష్టవశాత్తు ఆల్ రౌండర్‌గా మారాను" అని హార్ధిక్ వివరించాడు.