తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను ఫాస్ట్​బౌలర్​ను.. అదే నా రహస్యం': రషీద్​ ఖాన్​ - రషీద్​ ఖాన్​ గుజరాత్​ టైటాన్స్​

Rashid Khan IPL 2022: ఐపీఎల్​లో కొన్నేళ్లుగా సన్​రైజర్స్​కు ఆడిన అఫ్గాన్​ మిస్టరీ స్పిన్నర్​ రషీద్​ ఖాన్​.. ఈసారి గుజరాత్​కు ఆడుతున్నాడు. అయితే లెగ్​స్పిన్నర్​ అయిన రషీద్​.. తానో ఫాస్ట్​బౌలర్​ అంటున్నాడు. కారణమేంటి? రషీద్​ పేసర్​ ఏంటి?

I am 'spin-fast' bowler: Rashid Khan
I am 'spin-fast' bowler: Rashid Khan

By

Published : Apr 2, 2022, 7:11 AM IST

Rashid Khan IPL 2022: నెమ్మదిగా బంతి వేస్తూ.. దాన్ని గింగిరాలు తిప్పేవాళ్లు స్పిన్నర్లు. మంచి వేగంతో వికెట్లను ఎగరగొట్టేవాళ్లు పేసర్లు. కానీ ఈ రెండు కలగలసిన బౌలర్‌.. రషీద్‌ ఖాన్‌. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసే అతను.. తానో స్పిన్‌ ఫాస్ట్‌ బౌలర్‌నని చెప్పుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో కీలక ఆటగాడిగా మారిన ఈ 23 ఏళ్ల అఫ్గాన్‌ స్పిన్నర్‌.. ఇప్పటికే లీగ్‌ల్లో 312 మ్యాచ్‌ల్లో 436 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌ వరకు సన్‌రైజర్స్‌ ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న అతను.. ఈ సారి ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫునా అదరగొడుతున్నాడు.

''వేగంతో బౌలింగ్‌ చేస్తా కాబట్టి నేను స్పిన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ని. గంటకు 96 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తా. అంత వేగంతో వేసిన బంతిని స్పిన్‌ చేయడం చాలా కష్టం. అందుకు విభిన్నమైన నైపుణ్యాలు కావాలి. కానీ వేగాన్ని తగ్గించి బంతిని ఎక్కువగా తిప్పాలనుకోను. వేగంగా లెగ్‌స్పిన్‌ వేయడానికే ఇష్టపడతా. నేనో లెగ్‌స్పిన్నర్‌నని అనుకోను. ఎందుకంటే ఆ స్పిన్నర్లు తమ మణికట్టును ఎక్కువగా వాడతారు. కానీ నేనా స్థాయిలో మణికట్టును ఉపయోగించను. నా వేళ్లని మాత్రమే ఎక్కువగా వాడతా. నిలకడగా ఒకే లైన్‌, లెంగ్త్‌లో బంతి వేయడం నా బౌలింగ్‌ రహస్యం. మన నైపుణ్యాలపై పట్టు ఉండి సరైన ప్రాంతాల్లో బౌలింగ్‌ వేసినంత కాలం తిరుగుండదు. మిగతా లెగ్‌స్పిన్నర్ల కంటే విభిన్నంగా బౌలింగ్‌ చేస్తున్నానంటే నా లెంగ్త్‌ కారణం. తీవ్ర ఒత్తిడిలోనూ బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా.'' అని రషీద్‌ తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details