అప్ఘానిస్థాన్ క్రికెట్ జట్టుకు సారథిగా మళ్లీ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు ఆ దేశ స్పిన్‌బౌలర్ రషీద్ ఖాన్(Rashid Khan). ఇటీవల అస్గర్ అఫ్ఘాన్‌పై వేటు వేసిన బోర్డు.. టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిదిని సారథిగా, రహ్మత్ షాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌కు సారథిగా రషీద్‌ను తీసుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసి.. ఆ ఫార్మాట్‌కు ఇంకా సారథిని నియమించలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రషీద్.. తనకు కెప్టెన్సీపై ప్రస్తుతం మోజు లేదని అన్నాడు. ఆ పగ్గాలు అందుకుంటే తన ప్రదర్శనపై ప్రభావం పడుతుందని చెప్పాడు.
Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు' - అప్ఘానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీ
జాతీయ జట్టుకు మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించాలని తాను భావించట్లేదని అన్నాడు ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan). సారథి బాధ్యతలు స్వీకరిస్తే తన ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశముందని చెప్పాడు.
"ఓ ఆటగాడిగా జట్టు కోసం మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాను. కెప్టెన్‌గా ఉండి పలు విషయాలపై దృష్టి సారించడం కన్నా ఓ ఆటగాడిగా నా ప్రదర్శన టీమ్‌కు చాలా అవాసరం. త్వరలోనే ఎంతో ముఖ్యమైన ప్రపంచకప్ రాబోతుంది. కాబట్టి కెప్టెన్‌గా ఉంటే నా ఆటపై ప్రభావం పడొచ్చు. కాబట్టి ఆ బాధ్యతలు స్వీకరించాలనుకోవట్లేదు. ఓ ప్లేయర్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి నా మద్దతు ఉంటుంది." అని రషీద్ అన్నాడు. రషీద్ ఖాన్.. వన్డేల్లో(ఏడు), టెస్టుల్లో(రెండు), టీ20ల్లో ఏడుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇదీ చూడండి 'బుమ్రా బౌలింగ్ టెక్నిక్ అతడికే ప్రమాదం'