డాక్టర్లు, కుటుంబ సభ్యుల మద్దత వల్లే కొవిడ్‌ను జయించానని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) చెప్పాడు. వైరస్ బారిన పడినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి ఓ టీవీ ఛానల్లో వెల్లడించాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మనిషిగా చాలా మారానని స్పష్టం చేశాడు.
"కరోనాను జయించడం మంచి బౌలర్‌ను బ్యాట్స్‌మన్ క్రీజులో ఎదుర్కొవడం లాంటిది. బ్యాట్స్‌మన్‌ను బయటి నుంచి టీమ్ సభ్యులు మద్దతుగా నిలిచి.. ఉత్సాహపరుస్తారు. అలాగే కొవిడ్‌ను నేను ఎదుర్కొనే సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది.. నాకు మద్దతుగా నిలిచారు. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కొవిడ్ బారిన పడినప్పుడు, నిజం చెప్పాలంటే అంతకంటే ముందే.. నా శరీరం నాకు సహకరించలేదు. నేను కొంత అసౌకర్యానికి గురయ్యాను. కరోనా రిపోర్ట్ రావడానికి ముందే నేను ఐసోలేషన్లోకి వెళ్లిపోయాను. అది నేను చేసిన మంచి పని"
-సచిన్ తెందుల్కర్, మాజీ క్రికెటర్
అంజలి మద్దతు..
ఆస్పత్రిలో చేరిన తొలి వారం రోజులు చాలా ఇబ్బందిగా అనిపించిందని, ఆరోగ్యం ఇంకా క్షీణించిందని మాస్టర్ బ్లాస్టర్ గుర్తు చేసుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆరోగ్యం కుదుటపడిందని తెలిపాడు. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా తన ఇంట్లో 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇలా గడపడం చాలా కష్టమని చెప్పాడు. తనకు భార్య అంజలి పూర్తి మద్దతుగా నిలిచిందని సచిన్ తెలిపాడు. ఆమె డాక్టర్ కావడం వల్ల పరిస్థితులు అర్థం చేసుకునేదని పేర్కొన్నాడు. మహమ్మారి నుంచి కోలుకోవడమనేది పూర్తిగా కష్టమైన విషయమని చెప్పాడు.
మనిషిగా మారాను..