భారత ప్రముఖ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్.. అమెరికా టీ20 లీగ్‌లో ఆడనున్నాడని పాక్ క్రికెటర్ సమీ అస్లామ్ చెప్పాడు. ఇతడే కాకుండా పలువురు భారత యువ ఆటగాళ్లు అమెరికాలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల్ని ఖండించిన ఉన్ముక్త్.. ఎవరితోనూ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశాడు. కేవలం బంధువులను కలిసేందుకు అమెరికా వెళ్లినట్లు తెలిపాడు. కేవలం ప్రాక్టీస్ మాత్రమే అక్కడ చేసినట్లు వెల్లడించాడు.
పాక్ క్రికెట్ బోర్డులో అన్యాయాలు జరుగుతున్నాయని అందుకే తమ దేశ క్రికెట్‌ను విడిచిపెట్టి, అమెరికన్ టీ20లీగ్‌లో ఆడుతున్నట్లు పాక్ క్రికెటర్ సమీ అస్లామ్ చెప్పాడు.
"30 నుంచి 40 మంది విదేశీ ఆటగాళ్లు ఇటీవల అమెరికాకు వచ్చారు. అందులో భారత్ అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్, స్మిత్ పటేల్, హర్మీత్ సింగ్ ఉన్నారు. నేను పాకిస్థాన్ తరఫున ఆడి తప్పుచేశాను. పాక్ జట్టులో సరైన గుర్తింపు దక్కలేదు. సెలక్టర్లు చిన్నచూపు చూసేవారు. అందుకే అమెరికా మేజర్ క్రికెట్ టోర్నీలో అడుగుపెట్టాను. పాక్ క్రికెట్లోని అన్యాయాలను గ్రహించి అక్కడి 100 మంది ఫస్ట్‌క్లాస్ ఆటగాళ్లు ఇక్కడ ఆడేందుకు సిద్ధమయ్యారు. వారంతా నాతో టచ్‌లో ఉన్నారు" అని అస్లామ్ చెప్పాడు.