Hundred League 2023 Smriti Mandhana : టీమ్ఇండియా మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. హండ్రెడ్ లీగ్‌లో అదరగొడుతోంది. సూపర్ ఫామ్‌లో ఆడుతూ రికార్డులు బద్దలు గొడుతోంది. ఈ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఖాతాలో ప్రస్తుతం 13 సిక్స్‌లు ఉన్నాయి.
అంతేకాదు 100 బాల్ టోర్నీలో అత్యధిక హాఫ్ సెంచరీలతో మంధాన భారత్‌కే చెందిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు జెమీమా, మంధాన ఇద్దరూ నాలుగేసి అర్ధ శతకాలు బాదారు. డియేండ్ర డాటిన్, నాట్ సీవర్ బ్రంట్, లారా వాల్వార్డ్త్, డానియెల్లె వ్యాట్ మూడు హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.
సథర్న్ బ్రేవ్ జట్టు తరఫున ఆడుతున్న స్మృతి మంధాన ఆరంభ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన పోరులో ట్రెంట్ రాకెట్స్ జట్టుపై కేవలం 36 బంతుల్లోనే 55 రన్స్ కొట్టింది. ఆమె ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు ఉన్నాయి. దాంతో, ఈ లీగ్‌లో మంధాన సిక్సర్ల సంఖ్య 13కు చేరింది. నాట్ సీవర్ బ్రంట్ కూడా 49 పరుగులతో రాణించడంతో సథర్న్ బ్రేవ్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మేరీ టేలర్ మూడు వికెట్లు తీయడంతో సథర్న్ జట్టు ఈ మ్యాచ్‌లో 27 రన్స్ తేడాతో గెలుపొందింది.
రెండు మ్యాచుల్లోనే..
ఈమధ్యే బంగ్లాదేశ్ పర్యటనలో చెలరేగిన మంధాన.. బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వేలంలో రూ.3.4కోట్ల రికార్డు ధర పలికిన ఆమె ఆటలో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా విఫలమైంది. కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఐదు జట్లు పోటీ పడిన ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబయి ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ట్రోఫీని అందుకుంది.