తొలుత ఆ బ్యాటర్ చెలరేగాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బౌలింగ్ చేయని అతడితో ఇక అవసరం లేదని భావించిన కెప్టెన్.. ఫీల్డింగ్ సమయంలో అతడి స్థానంలో బౌలర్‌ను బరిలో దింపాడు. అతడూ విజృంభించి వికెట్లు పడగొట్టడంతో జట్టు ఘన విజయాన్ని అందుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో దిల్లీ, మణిపూర్ మధ్య మ్యాచ్‌లోని దృశ్యమిది. ఓపెనర్ హితెన్ దలాల్ (47; 27 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో మొదట దిల్లీ 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.
బౌలర్‌గా అదరగొట్టిన సబ్‌స్టిట్యూట్.. ఆ ట్రోఫీలో తొలి 'ఇంపాక్ట్ ప్లేయర్'గా.. - shokeen impact player
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో దిల్లీ, మణిపుర్ మధ్య జరిగిన మ్యాచ్‌లోని ఛేదనలో బ్యాటర్ హితెన్‌కు బదులు ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను ఆడించిన దిల్లీ లాభపడింది. అయితే షోకీన్.. టోర్నీలో మొదటి ఇంపాక్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఆ వివరాలు..
ఛేదనలో హితెన్‌కు బదులు ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను ఆడించిన దిల్లీ లాభపడింది. షోకీన్ (2/13) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణీత ఓవర్లలో మణిపుర్ 96/7కు పరిమితమైంది. సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్‌కే పరిమితం కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ బీసీసీఐ 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశముంది. టోర్నీలో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా షోకీన్ నిలిచాడు.
తిలక్ పోరాటం వృథా
ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌ను హైదరాబాద్ ఓటమితో మొదలుపెట్టింది. గ్రూప్-బి పోరులో 59 పరుగుల తేడాతో పంజాబ్ చేతిలో ఓడింది. మొదట పంజాబ్ 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (50), సన్వీర్ సింగ్ (55) రాణించారు. దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేసిన రక్షణ్ రెండు వికెట్లు తీయగా.. పున్నయ్య, రవితేజ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 18.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. తిలక్‌వర్మ (50) పోరాడినా ఫలితం లేకపోయింది.