తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ ఇండియాకు ఝలక్​.. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్​కు చేరాలంటే.. - the third test against Australia

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్​ మ్యాచ్​లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది టీమ్​ ఇండియా. ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిన టీమ్​ ఇండియాకు ఇప్పుడు వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​ షిప్​ ఫైనల్స్​కు చేరుకునే మార్గం కష్టతరంగా మారింది. ఆ వివరాలు..

ind vs autralia
ind vs autralia

By

Published : Mar 3, 2023, 1:15 PM IST

Updated : Mar 3, 2023, 1:48 PM IST

ఇండోర్​ వేదికగా జరిగిన మూడో టెస్ట్​ మ్యాచ్​లో ఘోర పరాజయాన్ని చవి చూసింది టీమ్​ ఇండియా. గత రెండు టెస్టుల్లో మంచి విజయాన్ని సాధించిన భారత్.. మూడో టెస్ట్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. మూడో రోజు తొలి సెషన్​లో 18.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా టీమ్.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని ముద్దాడింది. దీంతో ఇక టీమ్​ ఇండియా జట్టు ఇరకాటంలో పడ్డట్లే అని విశ్లేషకులు అంటున్నారు.

ఐసీసీ వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​ రేసులో ఉన్న టీమ్​ ఇండియా.. ఒక వేళ ఈ ఇండోర్​ టెస్ట్​ మ్యాచ్​లో విజయాన్ని సాధించి ఉంటే ఈజీగా ఫైనల్స్​లో తన స్థానాన్ని ఖరారు చేసుకుని ఉండేది. కానీ అలా జరగలేదు.​ అయితే ఆస్ట్రేలియా మాత్రం ఈ విజయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా జూన్​ 7 నుంచి 11 వరకు లండన్​ వేదికగా జరగనున్న వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​ షిప్​ ఫైనల్​కు బెర్త్ ఖరారు చేసుకుంది.

టీమ్​ ఇండియాకు దారేది?..ఇప్పటికే ఈ ఘోర పరాభవంతో కుంగిపోయిన టీమ్​ ఇండియా ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్​ వేదికగా మార్చి 9 నుంచి జరగనున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చిత్తుగా ఓడించాలి. అప్పుడే ఈ చిక్కుల్లో నుంచి భారత్​ బయటపడే ఛాన్స్ ఉంది. అయితే ఒక వేళ ఈ మ్యాచ్​లోనూ టీమ్​ ఇండియా ఓటమిపాలైతే ఫైనల్స్​కు చేరుకునేందుకు మరో దారి ఉంది.

అదేంటంటే.. ఇక్కడ టీమ్​ఇండియా భవితవ్యం న్యూజిలాండ్​- శ్రీలంక టెస్టు సిరీస్​పై ఆధారపడి ఉంటుంది. మార్చి 9 నుంచి 21 వరకు జరిగే ఈ రెండు మ్యాచుల సిరీస్​లో లంక జట్టును కనీసం ఒక్క మ్యాచులో ఓడిపోవాలి లేదా డ్రా చేసుకోవాలి. అలా టీమ్​ ఇండియా రెండో ఆఫ్షన్​తో ఫైనల్​కు చేరుకోగలదు. మరోవైపు 2021-23 ఐసీసీ వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో 68.52 శాతం విజయాలతో ఆస్ట్రేలియా టాప్​ ప్లేస్​ను సొంతం చేసుకుంది. ఇక టీమ్​ ఇండియా 60.29 శాతం​తో రెండో స్థానానికి పరిమితమయ్యింది. శ్రీ లంక టీమ్​ 53.33 శాతం విజయాలతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

'ఓడినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయా'..
మూడో టెస్ట్​ ఓటమి తర్వాత కెప్టెన్​ రోహిత్ శర్మ స్టేడియం పిచ్​పై పలు సంచలన కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా ఇటువంటి పిచ్​పైనే తాము ఆడాలని ఎప్పుడో నిర్ణయించుకున్నామంటూ వ్యాఖ్యానించాడు. "ఇలాంటి పిచ్​లపై ఆడాలన్నది సమష్టిగా తీసుకున్న నిర్ణయం. మేము బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెట్టదలచుకోలేదు. అయితే గెలిచినప్పుడు బ్యాటింగ్ గురించి ఎవరూ మాట్లాడరు. ఓడిపోయినప్పుడే ఇలాంటివన్ని చర్చకు వస్తాయి. ఓ జట్టుగా మేము ఇలాంటి పిచ్ లపైనే ఆడాలని అనుకున్నాం" అని రోహిత్ తేల్చి చెప్పాడు.

Last Updated : Mar 3, 2023, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details