T20 World Cup India Prize Money: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్ తుది సమరంలో పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి 1992 సీన్‌ను బాబర్ అజామ్ సేన రిపీట్ చేస్తుందా లేక ఇంగ్లాండ్ ధాటికి తోకముడిచి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
T20 World Cup: టీమ్ఇండియాకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా? - టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీ
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. అయితే భారత క్రికెట్ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా?
ఇక సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమ్ఇండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా ఇదే మొత్తం లభించనుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లలో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది.
- సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు )
- ఫస్ట్‌రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు)
- ఫస్ట్‌రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు)
ఇవీ చదవండి: