తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, విలియమ్సన్ సారథ్యంపైనే అందరి దృష్టి' - Hesson about kohli

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC final) కోహ్లీ, విలియమ్సన్ (Williamson) సారథ్యంపై ఆసక్తి నెలకొందని తెలిపాడు కివీస్ మాజీ కోచ్ మైక్ హెసన్. ఈ ఇరు జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

Kohli Williamson
కోహ్లీ, విలియమ్సన్

By

Published : Jun 7, 2021, 9:15 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌((WTC final)) ఫైనల్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli), న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(Williamson)లు.. ఏ విధంగా తమ జట్లను ముందుండి నడిపిస్తారనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుందని కివీస్‌ మాజీ ప్రధాన కోచ్‌ మైక్‌ హెసన్ అన్నాడు. ఈ ఇరు జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

"వారిద్దరూ చాలా మంచి కెప్టెన్‌లు. కెప్టెన్సీలో ఇద్దరిది భిన్నమైన శైలి. ఆటగాళ్లు వారిని అనుసరించాలనుకుంటున్నారు. ఇది ఏ కెప్టెన్‌కైనా గొప్ప గుర్తింపు. విలియమ్సన్‌.. ఓపికతో ఉంటూ నిర్ణీత సమయంలో ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తాడు. విరాట్‌ ఇందుకు పూర్తి భిన్నం. నిరంతరం ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు" అని హెసన్‌ అన్నాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్‌ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీల కెప్టెన్సీకి పరీక్ష లాంటిది. రోజురోజుకూ పిచ్‌(వికెట్‌) పరిస్థితులు మారుతున్నప్పడు వారు తమ వ్యూహాలలో చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తూ ఎలా ముందుకు వెళతారనే ఆసక్తికరంగా ఉంటుంది. టీమ్ఇండియా టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్.. న్యూజిలాండ్‌ బౌలర్ల స్వింగ్‌ బంతులను ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఉత్సుకతతో ఉన్నా. న్యూజిలాండ్‌ బౌలర్లను టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించొచ్చు" అని మైక్‌ హెసన్‌ ముగించాడు.

ABOUT THE AUTHOR

...view details