కొన్ని నెలలుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు దొరకక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఎంపికైనా తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికవ్వలేదు. ఈ క్రమంలోనే ఈ విషయమై స్పందించిన కుల్దీప్ చాలా బాధపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటన సమయంలోనే పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన భారత్ మరో జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. కనీసం ఈ సిరీస్‌కు అయినా అతడిని సెలక్టర్లు ఎంపిక చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నట్లు కుల్దీప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియాలో స్థానం దక్కకపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే జట్టుతో కలిసి మంచి ప్రదర్శన చేసి విజయాల్లో భాగస్వామ్యం అవ్వాలని అనుకున్నాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతుంటుంటాయి. జట్టులో కలిసి ఆడటానికి అవకాశం రానప్పుడు ఏ ఆటగాడైనా బాధపడటాడు. టీమ్‌లో ఉండటానికి ఆశగా ఎదురుచూస్తుంటాడు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులు అనుకూలించవు. అయితే అదే సమయంలో మరో అవకాశం దొరికితే బాగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. శ్రీలంక పర్యటనకు నాకు అవకాశం వస్తుందని భావిస్తున్నాను"