ఆసియా కప్-2022లో భాగంగా బుధవారం జరిగిన టీమ్ఇండియా-హాంకాంగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా..ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్ క్యూట్ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే మరోవైపు చాహర్, అతడి ప్రేయసి ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.