తెలంగాణ

telangana

ETV Bharat / sports

గద పట్టకపోయినా విజేతలే - టెస్ట్ ఛాంపియ‌న్​షిప్​లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్లు వీరే !

Highest Wicket takes in WTC : క్రికెట్​లో బ్యాట‌ర్ల‌కు ఎంత ప్రాధాన్యత ఉందో బౌల‌ర్ల‌కూ అంతే ఉంటుంది. కొన్ని సార్లు బౌలర్లే మ్యాచుల‌ను గెలిపించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టి దాకా ఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్​షిప్​లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లెవ‌రో ఓ లుక్కేదామా. Test Mace

Highest Wicket takes in WTC Test
Highest Wicket takes in WTC Test

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 8:20 AM IST

Highest Wicket takes in WTC Test :ఐసీసీ నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్స్​లో టెస్టు ఛాంపియ‌న్​షిప్ ఒక‌టి. 2019 తొలిసారి జరిగిన టోర్నీలో భార‌త్​పై న్యూజిలాండ్ గెలిచి తొలి ఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్​ జట్టుగా అవ‌త‌రించింది. ఆ త‌ర్వాత రెండో సారి 2023లో టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు విజ‌యం సాధించింది. ఇలా జరిగిన రెండు ఎడిషన్లలోనూ భారత్​ జట్టు ఫైనల్స్​ వరకు చేరుకుని ఓటమిని చవి చూసింది. అయితే ఈ రెండింటిలోనూ టీమ్ఇండియా పలు రికార్డులను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో భార‌త్ త‌ర‌ఫున ఈ టోర్నీల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు ఎవరంటే ?

  1. ర‌విచంద్ర‌న్ అశ్విన్
    టీమ్​ఇండియాలో ఉన్న అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో రవిచంద్రన్ అశ్విన్ ఒక‌డు. అటు బౌలింగ్ తోనే కాక‌ుండా ఇటు బ్యాటింగ్ తోనూ రాణిస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇక ఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్​లో అశ్విన్ ఇప్ప‌టిదాకా 148 వికెట్లు ప‌డ‌గొట్టి అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌ లిస్ట్​లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.
  2. జ‌స్ప్రీత్ బూమ్రా
    ఈ త‌రం ఇండియ‌న్ బెస్ట్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మేటి ప్లేయర్​గా రాణిస్తున్నాడు. త‌న యార్క‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్లు బోల్తా కొట్టించ‌గ‌ల‌ ఈ స్టార్ ప్లేయర్, ఫార్మాట్ ఏదైన సరే తన వినూత్న‌మైన బౌలింగ్ స్టైల్​తో వికెట్లు తీస్తాడు. అలా ఈ స్టార్ క్రికెటర్ టెస్ట్ ఛాంపియ‌న్​షిప్​లో ఇప్ప‌టి వ‌ర‌కు 91 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
  3. మ‌హమ్మ‌ద్ ష‌మీ
    ఇటీవలే జరిగిన వ‌ర‌ల్డ్​ క‌ప్​లో సంచలనాలు సృష్టించాడు టీమ్ఇండియా పేసర్ మ‌హమ్మ‌ద్ ష‌మీ. వ‌చ్చీ రాగానే వికెట్లు తీయ‌డంతో పాటు కీలక స‌మ‌యాల్లో ప్రత్యర్థులను కట్టడి చేసి పలు మార్లు టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. త‌న స్పీడ్ బంతులు, యార్క‌ర్లతో ఈజీగా వికెట్లు తీయగ‌ల షమీ, టెస్ట్ ఛాంపియన్​షిప్​లో ఇప్ప‌టిదాకా 85 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
  4. ర‌వీంద్ర జ‌డేజా
    టీమ్​ఇండియాలోని మేటి ఆల్​రౌండర్లలో ర‌వీంద్ర జ‌డేజా ఒక‌డు. ఈ త‌రం క్రికెటర్ల‌లో భార‌త జ‌ట్టుకు ల‌భించిన బెస్ట్ ఆల్ రౌండ‌ర్​గా పేరొందిన జడ్డూ. బ్యాటింగ్, బౌలింగ్​తోనే కాకుండా త‌న ప‌దునైన ఫీల్డింగ్​తోనూ ప‌రుగులను కట్టడి చేయగలడు. మెరుపు వేగంతో ప‌రుగెత్తి క్యాచ్​లను ప‌ట్ట‌గ‌ల‌డు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు బాల్ అందుకుని వికెట్లు కూడా తీయ‌గ‌లడు. అలా టెస్టు ఛాంపియన్​షిప్​లో జ‌డేజా ఇప్ప‌టి దాకా 83 వికెట్లు తీశాడు.
  5. మహమ్మ‌ద్ సిరాజ్
    హైద‌రాబాదీ కుర్రాడు మహమ్మ‌ద్ సిరాజ్ కూడా వికెట్లు పడగొట్టడంలో సమర్థుడు. ఐపీఎల్​లో ఆర్సీబీ త‌ర‌ఫున ఆడి వెలుగులోకి వచ్చిన ఈ స్టార్ ప్లేయర్, ఆ త‌ర్వాత టీమ్ఇండియా బౌలింగ్ విభాగంలో స్థానం సంపాదించాడు. ఇక ఈ యంగ్ ప్లేయర్ తన టెస్ట్ ఛాంపియన్​షిప్​లో కెరీర్​లో 68 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
  6. ఉమేశ్​ యాద‌వ్
    టీమ్​ఇండియా సీనియ‌ర్ బౌల‌ర్ ఉమేశ్ యాద‌వ్​కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో అతడు ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ ఆడ‌లేదు. కానీ ఐపీఎల్​లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ఉమేశ్​ ఇప్ప‌టిదాకా టెస్ట్ ఛాంపియన్​షిప్​లో 51 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
  7. అక్ష‌ర్ ప‌టేల్
    టీమ్ఇండియా జట్టులోని మ‌రో ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ కూడా ఈ మధ్యే అంత‌ర్జాతీయ మ్యాచ్​లు ఆడుతున్నాడు. వ‌న్డే, టీ - 20 ల్లో పెద్దగా అవ‌కాశాలు రానప్పటికీ టెస్టు జట్టులోకి అతడ్ని తీసుకున్నారు. ఇక అక్ష‌ర్ ఇప్ప‌టి దాకా ఛాంపియన్​షిప్​లో 50 వికెట్లు తీసి ఏడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.
  8. ఇషాంత్ శ‌ర్మ‌
    సీనియర్​ ప్లేయర్ ఇషాంత్ శ‌ర్మ‌కు ఇప్పుడు అవ‌కాశాలు రావ‌టం క‌ష్ట‌మ‌య్యాయి. ఒక‌ప్పుడు త‌న బౌలింగ్​తో ప్ర‌త్య‌ర్థులను హ‌డ‌లెత్తించిన ఈ స్టార్​ ప్లేయర్, త‌న ఎత్తుకు త‌గ్గ‌ట్లు బౌన్సర్లు వేసి బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టేవాడు. ఇక 2013లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ చివ‌రి స‌మ‌యంలో కీల‌క వికెట్లు తీసి టీమ్ఇండియా విజ‌యంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక ఇషాంత్ తన టెస్టు ఛాంపియన్​షిప్​ కెరీర్​లో మొత్తం 44 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
  9. శార్దూల్ ఠాకూర్
    టీమ్ఇండియా ఆల్ రౌండ‌ర్​ టీమ్​లోని మరో మెంబర్ శార్దూల్ ఠాకూర్. తన బ్యాటింగ్, బౌలింగ్​ స్కిల్స్​తో అందరినీ ఆకట్టుకునే ఈ స్టార్ క్రికెటర్ ఇప్ప‌టి దాకా జ‌రిగిన టెస్టు ఛాంపియన్​షిప్​లో మొత్తం 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం టీమ్ఇండియాలో పోటీ విప‌రీతంగా పెరిగిపోవ‌డం వల్ల ఠాకూర్ కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.
  10. కుల్​దీప్​ యాద‌వ్
    ఇండియ‌న్ లెగ్ స్పిన్న‌ర్ కుల్​దీప్ యాద‌వ్​కు ఈ కాలంలో జ‌ట్టులో స్థానం దొర‌క‌లేదు. ధోనీ హ‌యాంలో ఇత‌నికి, మ‌రో స్పిన్న‌ర్ చాహ‌ల్​కి బాగా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత త‌గ్గిపోయాయి. కుల్​దీప్​ ఇటీవ‌లే రీ ఎంట్రీ ఇచ్చి వ‌ర‌ల్డ్ క‌ప్​లో చోటు సంపాందిచి ఆడాడు. టెస్టుల్లోనూ ఆడ‌దా పాడ‌దా క‌నిపించాడు. టెస్ట్ ఛాంపియ‌న్​షిప్​లో 10 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ABOUT THE AUTHOR

...view details