టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి(Dhoni) వీడియో గేమ్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా సహచర ఆటగాళ్లతో ప్లేస్టేషన్ లేదా పబ్జీ ఆడుతూ కనిపిస్తుంటాడు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మహీ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పింది అతడి భార్య సాక్షి. నిద్రలో కూడా పబ్జీనే ఎక్కువగా కలవరిస్తాడని తెలిపింది.
"మహీ మెదడు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఆసలు విశ్రాంతి ఉండదు. కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ లేదా ఇతర ఆటలు ఆడినప్పుడు ఆ ఆలోచనల నుంచి బయటపడటానికి అవి సహాయపడతాయని అనుకుంటాను. పబ్జీ నా బెడ్రూమ్లోకి కూడా వచ్చేసింది. నాతో ఉన్నప్పటికీ, హెడ్ఫోన్స్ పెట్టుకొని ఇతర ప్లేయర్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో నిద్రలో కూడా ఈ ఆటగురించే ఎక్కువగా కలవరిస్తున్నాడు."
-సాక్షి, మహీ భార్య.