అభిప్రాయ భేదాల వల్ల కావొచ్చు మరే ఇతర కారణాల వల్ల అయినా కావొచ్చు.. విడాకులకు, రెండో పెళ్లికి క్రికెటర్లూ (cricketers who married twice) అతీతం కాదు. అలా రెండోసారి వివాహం చేసుకున్న క్రికెటర్లు ఎవరో ఓ లుక్కేయండి.
1. యోగ్రాజ్ సింగ్
మాజీ క్రికెటర్ యోగ్రాజ్ సింగ్.. భారత్ తరఫున ఒక టెస్టు మ్యాచ్, 6 వన్డేలు ఆడారు. ఆయన తొలుత శబ్నంను (యువరాజ్ సింగ్ తల్లి) పెళ్లాడారు. అనంతరం విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం యోగ్రాజ్ సత్వీర్ కౌర్‌తో వివాహబంధంలో ఉన్నారు. గాయం కారణంగా క్రికెట్ నుంచి వైదొలిగిన ఆయన నటుడిగా పంజాబీ, బాలీవుడ్ సినిమాల్లో కొనసాగుతున్నారు.
2. దినేశ్ కార్తిక్
టీమ్ఇండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్ తొలుత నిఖిత వంజరను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మరో భారత క్రికెటర్ మురళి విజయ్ ప్రేమలో పడి, దినేశ్ నుంచి విడాకులు తీసుకుంది. ఈ తర్వాత 2015లో భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్‌ను వివాహమాడాడు దినేశ్
3. మహ్మద్ అజారుద్దీన్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తొలుత నౌరీన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి అసద్, అయాజ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
అయితే 1996లో బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీతో అజర్ ప్రేమాయణం వల్ల ఆయన మొదటి వివాహా బంధానికి స్వస్తి చెప్పారు. 2010లో సంగీతకు కూడా విడాకులిచ్చారు.