Heath Streak Death : జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్(49) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసినట్లు అతడి అనుచరుడు హెన్రీ ఒలొంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకుంటున్న క్రికెట్ ప్రముఖులు, అతడి అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అయితే హెన్రీ ఇప్పుడు మరో కొత్త పోస్ట్ చేస్తూ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. హీట్ స్ట్రీక్ బతికే ఉన్నాడని, తనకు వచ్చిన సమాచారం తప్పుడు వార్త అని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ దగ్గర హీట్ చికిత్స తీసుకుంటున్నట్లు గత మే నెలలో అతడి కుటుంబ సభ్యులు చెప్పారు.
అయితే హెన్రీ కొత్త ట్వీట్ చూసిన క్రికెట్ అభిమానులు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ధ్రువీకరించకుండా ట్వీట్ చేయడం సరైన పద్ధతి కాదని ఫైర్ అవుతున్నారు. " అవన్నీ రూమర్స్. హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు. థర్డ్ అంపైర్ అతడిని వెనక్కి పిలిచాడు" అంటూ హెన్రీ మరో ట్వీట్ చేశాడు.
అంతకుముందు ట్వీట్లో "హీట్ స్ట్రీక్‌ను(Heath streak passed away) కోల్పోవడం చాలా బాధకరమైన విషయం. ఒక లెజెండ్‌ను కోల్పోయాం. ప్రపంచ క్రికెట్లో ఓ గొప్ప ఆల్ రౌండర్. మీతో ఆడడం చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు మీరు లేకపోవడం చాలా బాధకరంగా ఉంది" అని రాసుకొచ్చాడు.
Heath Streak Career : జింబాబ్వే జట్టును ఒకప్పుడు మేటి జట్టుగా తీర్చిదిద్దిన ఘనత హీత్ స్ట్రీక్కే దక్కుతుంది. ఆ జట్టుకు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్, ఫాస్ట్ బౌలర్‌గా సేవలిందించాడు. అతడి ఆల్ రౌండర్ ఆటతీరు జింబాబ్వే జట్టుకు ఎన్నో గొప్ప విజయాలను అందించింది. కెరీర్లో 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి 1990 పరుగులు , 189 వన్డేల్లో 239 వికెట్లు తీసి 2942 రన్స్ చేశాడు స్ట్రీక్. జింబాబ్వే తరపున 100 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. 1993 నుంచి 2005 వరకు దాదాపు 12 సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు సేవలందించాడు. 1993లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. 2000 నుంచి 2004 వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2005లో సెప్టెంబర్‌లో టీమ్ఇండియాపై(Heath Streak vs India) చివరి టెస్ట్ ఆడి.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
బౌలింగ్‌లో ఎంతో గొప్పగా రాణించిన అతడు.. మిడిల్ ఆర్డర్‌లోనూ బ్యాట్‌తో అద్భుతమైన సహకారం అందించేవాడు. హరారే వేదికగా వెస్టిండీస్‌పై తన తొలి ఏకైక టెస్టు సెంచరీని (127*) సాధించాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) కూడా ఆడాడు. కోచ్‌గానూ రాణించాడు. జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్‌కు కోచ్‌గా కూడా సేవలు అందించాడు.
Shikhar Dhawan Asia Cup 2023 : ధావన్ 'ఆట' ఇక గతమేనా?.. గబ్బర్ను మళ్లీ జట్టులో చూడగలమా?
Rinku Singh 5 Sixes : 'ఆ 5 సిక్సులు నా జీవితాన్నే మార్చేశాయి.. స్టాండ్స్‌లో ఫ్యాన్స్ అలా చేస్తే చాలా ఇష్టం'