ఈ ఏడాది అక్టోబర్-నవంబరులో టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్ వేదికగా ఈ మెగాటోర్నీ జరగాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఇంకా దీనిపై స్పష్టత లేదు. అయితే ఈ టోర్నీలో పాల్గొనే పాకిస్థాన్ జట్టులో పేసర్ మహ్మద్ ఆమిర్‌కు చోటివ్వాలని సూచించాడు ఆ దేశ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్. ఆమిర్ అనుభవం జట్టులోని యువ బౌలర్లకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.
"ఆమిర్ ఓ గొప్ప అనుభవజ్ఞుడైన బౌలర్. టీ20 క్రికెట్లో ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో అతడు ఒకడు. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టులో అతడు ఉండాలని నా అభిప్రాయం. ప్రపంచకప్ ఈవెంట్స్‌లో అనుభవం ఉన్న బౌలర్లు ఉండటం మంచిది. వారు యువ బౌలర్లకు మార్గనిర్దేశకులుగా ఉంటారు. సలహాలు ఇస్తూ మెళకువలు నేర్పిస్తారు. టీ20 ప్రపంచకప్ జట్టులో ఎటువంటి భయం లేని, అత్యంత ప్రభావితం చూపే ఆటగాళ్లు ఉండటం అవసరం.