టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్శర్మపై (Rohit Sharma) ప్రశంసల వర్షం కురిపించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో అతడి బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. అతడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు అంటూ కితాబిచ్చాడు.
"టెస్టుల్లో బ్యాటింగ్ పరంగా రోహిత్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ విభాగానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిలో రెండో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. బంతులను వదిలేసే విధానం, డిఫెన్స్ చేయడం.. అతడి ఆటలో పరిణితి కనిపిస్తుంది. మునుపటితో పోలిస్తే బ్యాటింగ్లో అతడు చాలా ఎదిగాడు" అని సచిన్ పేర్కొన్నాడు.
విదేశాల్లో ఇంతవరకు శతకాల ఖాతాను తెరవని రోహిత్.. ఆ అపవాదును అధిగమించే దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశాలపై సెంచరీలు చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.