తెలంగాణ

telangana

ETV Bharat / sports

HCA ISSUE: హెచ్​సీఏలో ముదురుతున్న గొడవలు

అజహరుద్దీన్​, అపెక్స్​ కౌన్సిల్​ సభ్యులు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హెచ్​సీఏ అధ్యక్షుడిగా అజహర్(HCA president Azharuddin)​ మళ్లీ కొనసాగుతారని అంబుడ్స్​మన్​ జస్టిస్ దీపక్​వర్మ తీసుకున్న నిర్ణయాన్ని అపెక్స్​ కౌన్సిల్​ సభ్యులు వ్యతిరేకించారు.

azharuddin
అజారుద్దీన్

By

Published : Jul 5, 2021, 3:35 PM IST

అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు ముదిరిపోతుంది. జింఖానా మైదానంలో అపెక్స్ కౌన్సిల్ గ్రూప్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుదామనుకుంటే.. పోలీసులు తమను అడ్డుకున్నారని వాపోయారు. దీంతో హెచ్​సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్​పై(HCA president Azharuddin) అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

అజహరుద్దీన్ డిక్టేటర్​గా వ్యవహరిస్తున్నారని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. అంబుడ్స్​మన్​గా జస్టిస్ దీపక్​వర్మను తాము వ్యతిరేకించినందుకు తమపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 3-డే లీగ్ నిర్వహించబోతున్నామని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. దానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటుచేయబోతుంటే.. అజహర్ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం అజహరుద్దీన్ హెచ్​సీఏ అధ్యక్షుడిగా లేరని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు స్పష్టం చేశారు. క్రికెట్ అభివృద్ధికి పాటుపాడాల్సిన ఆయన ఇప్పటి వరకు క్రికెట్​కు చేసిందేమిలేదని అన్నారు. ఉపాధ్యక్షుడు అయిన జాన్ మనోజ్​ను.. తాత్కాలిక అధ్యక్షుడిగా నిర్ణయించినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. జూలై 18న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని వారు వెల్లడించారు. ఏజీఎమ్​లో అంబుడ్స్​మన్​గా కక్రూకే మెజారిటీ లభించిందని వారు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details