తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆమె మూడు ఫార్మాట్లలో ఉండటం కలిసొస్తుంది' - షెఫాలీ వర్మపై మిథాలీ రాజ్​ ప్రశంసలు

కష్టపడడం వల్లే బౌన్సర్లను ఎదుర్కోవడంలో తాను మెరుగయ్యానని టీమ్​ఇండియా మహిళా క్రికెటర్​ షెఫాలీ వర్మ(Shefali Varma) తెలిపింది. ప్రతి సిరీస్‌ నుంచి పాఠాలు నేర్చుకుని ఆటను మెరుగుపరుచుకుంటున్నట్లు వెల్లిడించింది.

shefali
షెఫాలీ

By

Published : Jun 1, 2021, 8:02 AM IST

టీమ్​ఇండియా మహిళా క్రికెటర్​ షెఫాలీ వర్మ(Shefali Varma) దూకుడు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. వయసు 17 ఏళ్లే కానీ.. తాను అరంగేట్రం చేశాక ప్రపంచంలో ఏ మహిళా క్రికెటర్‌ కొట్టనన్ని సిక్స్‌లు కొట్టింది. తాజాగా ఇంగ్లాండ్‌ పర్యటనకు వన్డే, టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకుంది.

ప్రతి సిరీస్‌ నుంచి పాఠాలు నేర్చుకుని ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తానని షెఫాలీ చెబుతోంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) తర్వాత తన ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌ కూడా మెరుగుపడ్డాయని ఆమె తెలిపింది. మార్చిలో దక్షిణాఫ్రికాతో టీ20లో సిరీస్‌లో ఆమె వరుసగా 23, 47, 60 సాధించింది. ఆ సిరీస్‌లో బౌన్సర్లను ఆమె గతంలో కంటే మెరుగ్గా ఎదుర్కొంది. కష్టపడడం వల్లే బౌన్సర్లను ఆడడంలో తాను మెరుగుపడ్డానని షెఫాలీ తెలిపింది. "ఏదైనా విషయంలో మెరుగుపడాలని అనుకుని, ఒక్కసారి ప్రయత్నించి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. నేను సాధన చేసేటప్పుడు ఒక్కోసారి 150 బౌన్సర్లను కూడా ఎదుర్కొనేదాన్ని. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మరిన్ని బౌన్సర్లను ఆడేదాన్ని" అని చెప్పింది.

ఆమె 3 ఫార్మాట్లలో ఉండటం కలిసొస్తుంది

షెఫాలీ వర్మ మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికవడాన్ని టీమ్ఇండియా మహిళల జట్టు కెప్టెన్​ మిథాలీరాజ్ (Mithali Raj) స్వాగతించింది. దక్షిణాఫ్రికా సిరీస్​లో వైఫల్యం తర్వాత ఇంగ్లాండ్​లో రాణించడం అత్యంత కీలకమని ఆమె చెప్పింది. "మూడు ఫార్మాట్లలో షెఫాలీ ఉండటం జట్టుకు కలిసొస్తుంది. ఫార్మాట్లకు తగ్గట్లు ఆమె తన ఆటతీరును ఎలా మలుచుకుంటుందో చూడాలని ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో ఆడటం ప్రపంచకప్​కు(Worldcup) మంచి సన్నాహకం" అని తెలిపింది.

ఇదీ చూడండి: Mithali Raj: మా అందరి లక్ష్యం ఒక్కటే

ABOUT THE AUTHOR

...view details