బౌలింగ్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్‌పై తనకు గౌరవం పోయిందని వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్(Ambrose Gayle) అన్నాడు. తానైతే టీ20 ప్రపంచకప్‌కు గేల్‌ను(Chris Gayle News) ఎంపిక చేయనని ఆంబ్రోస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో గేల్ స్పందించాడు.
"వెస్టిండీస్ జట్టులోకి వచ్చినప్పుడు ఆంబ్రోస్‌పై ఎంతో గౌరవం ఉండేది. అతడికి నాపై ఎందుకంత వ్యతిరేకతో అర్థం కావట్లేదు. ఎప్పుడూ నా గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటాడు. అందరి దృష్టిని ఆకర్షించాలన్నది అతడి ఉద్దేశమా అన్నది నాకు తెలియదు. ఆంబ్రోస్ అంటే ఇప్పుడు యూనివర్స్ బాస్ (గేల్)కు ఎలాంటి గౌరవం లేదు. నాకెప్పుడు అతడు కనిపించినా ఇదే చెబుతా. ఒకసారి జట్టు ఎంపికైన తర్వాత ఆ జట్టుకు మద్దతు తెలపడం అవసరం" అని గేల్ అన్నాడు.