పాకిస్థాన్ ఆటగాడు హసన్ అలీపై(Hasan ali dropped catch) సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో కీలకమైన క్యాచ్‌ను హసన్ అలీ మిస్చేయడమే దీనికి కారణం. ఇదే వ్యవహారంపై పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పాడు హసన్ అలీ.
"టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో(pak vs aus t20) నా ప్రదర్శన కారణంగా మీరంతా బాధపడ్డారని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో నాకంటే.. ఎవరూ నిరాశపడలేదని అనుకుంటున్నా. నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. మళ్లీ తప్పకుండా పాకిస్థాన్ క్రికెట్ కోసం కష్టపడతా. మీ అందరికీ ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశాడు అలీ.
అదే టర్నింగ్ పాయింట్..
టీ20 వరల్డ్‌కప్‌లో(T20 world cup 2021).. లీగ్ దశలో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు ఆ జట్టు వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్. ఆస్ట్రేలియా 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను మిస్ చేశాడు హసన్ అలీ(Hasan ali dropped catch). దీంతో వరుసగా మూడు సిక్సర్లు బాది.. ఆస్ట్రేలియాను ఫైనల్‌కు చేర్చాడు వేడ్.