మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు - yuvaraj singh latest updates
Cricketer Yuvraj Singh Arrested: अनुसूचित जाति के खिलाफ अपमानजनक टिप्पणी करने के मामले में हांसी पुलिस ने क्रिकेटर युवराज सिंह (Cricketer Yuvraj Singh) को गिरफ्तार किया है.
21:37 October 17
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు
క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడని అరెస్ట్ చేశారు.
గతేడాది రోహిత్ శర్మతో జరిగిన లైవ్ చాటింగ్‌లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి యువీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ అప్పుడే హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా యువీని హిస్సార్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే యువీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేయడం వల్ల విడుదలయ్యాడు. పోలీసుల విచారణకు హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో తన న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు యువరాజ్ సింగ్ హాజరయ్యాడు.