ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ).. పురుషుల, మహిళల జట్ల మధ్య పక్షపాత ధోరణి చూపుతోందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను మహిళ క్రికెటర్లు హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్ తోసిపుచ్చారు.
ఇంగ్లాండ్తో సిరీస్ కోసం పురుషుల జట్టుతో పాటు మహిళల టీమ్ కూడా యూకే వెళ్లనుంది. అంతకు ముందే క్రికెటర్లందరూ క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. పురుషుల జట్టు ముంబయికి రావడానికి ఛార్టర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసిన బీసీసీఐ.. మహిళలను విస్మరించిందని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆర్టీపీసీఆర్ టెస్టుల నిర్వహణ విషయంలోనూ ఇదే విధంగా వివక్ష చూపిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు.