తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​లో మహిళల జోరు.. టాప్‌ -10కి హర్మన్‌ప్రీత్!

Harmanpreet ICC Ranking : అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన మహిళల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని దూసుకెళ్తోంది. మరోవైపు మన ప్లేయర్లు ఏయే ర్యాంకింగ్స్​తో రాణిస్తున్నారంటే ?

womens icc rankings 2023
harmanpreet kaur

By

Published : Jul 11, 2023, 7:05 PM IST

Womens ICC Rankings 2023 : అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్లేయర్లు తమ స్థానాలను మెరుగుపరుచుకుని ముందుకు సాగగా.. టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్ దూసుకెళ్లింది. ఏకంగా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకుని పదో ర్యాంక్‌కు చేరింది. శ్రీలంక ప్లేయర్ చమారి ఆటపట్టు, ఇంగ్లాండ్‌ ప్లేయర్ నటాలీ స్కివెర్​తో కలిసి హర్మన్​ సంయుక్తంగా ఈ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 35 బంతుల్లోనే 54 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన ఘనతను ఖాతాలోకి వేసుకున్న హర్మన్​ మరో ప్రతిష్టాత్మక రికార్డును తన ఖాతాలోకి వేసుకుంది.

మరోవైపు ఈ జాబితాలో తహిలా మెక్‌గ్రాత్ (784), బెత్ మూనీ (777), స్మృతీమంధాన (728), సోఫీ డివైన్ (683 పాయింట్లు), బేట్స్‌ (677)తో టాప్‌ -5 స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇక బౌలర్ల జాబితాలో భారత బౌలర్‌ దీప్తి శర్మ (733 పాయింట్లు) మూడో ర్యాంకింగ్​లో కొనసాగుతూ రెండో ర్యాంకర్‌ లబా (746)కు కాస్త చేరువగా వచ్చింది. ఇంగ్లాండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ (788) అగ్రస్థానంలో ఉంది. దీప్తి శర్మ కాకుండా రేణుకా సింగ్ (693 పాయింట్లు) తొమ్మిదో స్థానంతో భారత్‌ తరఫున టాప్ -10లో కొనసాగుతున్న రెండో బౌలర్​గా నిలిచింది. ఇక ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో ఆసీస్ ప్లేయర్ ఆష్లే గార్డెనర్ (435) అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ బౌలర్ దీప్తి శర్మ (395) ఐదో స్థానంలో కొనసాగుతోంది.

గతంలో విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన..ఒక్కో స్థానం కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్‌.. ఓ ర్యాంక్‌ కోల్పోయి ప్రస్తుతం ఆరో స్థానంలో నిలువగా.. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మందన ఏడో ర్యాంక్‌కు చేరింది. హర్మన్‌ప్రీత్‌ 716 పాయింట్లతో .. స్మృతి 714 ర్యాంకింగ్‌ పాయింట్లతో ఈ స్థానాన్ని దక్కించుకోగా.. శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు (758 పాయింట్లు) బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details