Hardik Pandya World Cup 2023 :గత కొద్దికాలంగా హార్దిక్ బౌలింగ్, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ మళ్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు హార్దిక్ పాండ్య. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో హార్దిక్ ఆడిన విధానం.. వరల్డ్ కప్‌నకు ముందు టీమ్‌కు భరోసాను, అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ మినీ టోర్నీలో రెండు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడతడు. 46 యావరేజ్‌తో 92 పరుగులు చేయగలిగాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో పడినప్పుడు 90 బంతుల్లో 87 పరుగులతో రాణించాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది కానీ.. హార్దిక్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో 4 ఇన్నింగ్స్‌లో 11.33 యావరేజ్ 6 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 3.34గా ఉండటమే అతడి మెరుగైన ఆటకు నిదర్శనం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మూడు వికెట్లతో లోయర్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ప్రధాన బ్యాటర్లను పెవిలియన్‌కు పంపినా లోయర్ ఆర్డర్‌ను ఎదుర్కోలేక.. భారత్ ఎన్నో మ్యాచుల్లో మంచి అవకాశాలను మిస్ చేసుకుంది. కానీ ఈ సారి హార్దిక్ ఆ అవకాశమే ఇవ్వలేదు.
Hardik Surgery : 2018 ఆసియా కప్ టైమ్‌లోనే హార్దిక్ వెన్నెముక గాయం బారిన పడ్డాడు. ఆ నొప్పితోనే 2019 వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగాడు. కానీ పూర్తి స్థాయిలో రాణించ లేకపోయాడు. ఇక ఆ టోర్నీ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో వెన్నెముక సర్జరీ చేయించుకున్నాడు. చాలా సమయం తర్వాత కోలుకుని.. తిరిగి క్రికెట్లో అడుగుపెట్టినా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. దీంతో అతడి కెరీర్ ఆరంభంలో మరో కపిల్ దేవ్ అవుతాడని పెట్టుకున్న అంచనాలు తప్పాయా? ఇకపై కేవలం బ్యాటర్‌గానే కొనసాగుతాడా? అన్న సందేహాలు వచ్చాయి.