తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​'గా హార్దిక్​ - ఫ్యాన్స్ కొత్త డిమాండ్​- ఎందుకంటే? - హార్దిక్​ పాండ్యా లేటెస్ట్ ఫొటోలు

Hardik Pandya World Cup 2023 : గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమ్ఇండియా ప్లేయర్​ హార్దిక్ పాండ్యా.. వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్స్​ మ్యాచ్​లో కనిపించాడు. దీంతో ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేశారు. అయితే మరికొందరు మాత్రం అతని సోషల్​ మీడియాలో ట్రెండ్​ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Hardik Pandya World Cup 2023
Hardik Pandya World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 1:00 PM IST

Hardik Pandya World Cup 2023 :వన్డే ప్రపంచకప్​లో తమ సత్తా చాటిన టీమ్​ఇండియా ఇప్పుడు ఫైనల్స్​లోకి అడుగుపెట్టింది. మహమ్మద్​ షమీ, విరాట్​ కోహ్లి, శ్రేయస్ అయ్యర్​ లాంటి ప్లేయర్లు చెలరేగడం వల్ల భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు రోహిత్​ సేనపై నెట్టింట సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. దీంతో వారందరూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. అయితే తాజాగా టీమ్ఇండియా ప్లేయర్​ హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. దీంతో జట్టు ప్లేయర్లతో పాటు హార్దిక్ పేరు కూడా నెట్టింట తెగ మారుమోగిపోతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..
Hardik Pandya India Vs Newzealand :గాయం కారణంగా మ్యాచ్​కు దూరమైన హార్దిక్ ప్రస్తుతం చికిత్సతో పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఎక్కడా కనిపించని ఈ స్టార్ ప్లేయర్​.. ముంబయి వేదికగా న్యూజిలాండ్​తో కనిపించిన మ్యాచ్​లో ప్రత్యక్షమయ్యాడు. స్టాండ్స్​లో మిగతా సెలబ్రిటీలతో కూర్చుని మ్యాచ్​ను వీక్షించాడు. అయితే ఆ సమయంలో తను కొబ్బరి బోండం తాగుతూ చిల్​ అవుతున్నట్లు కనిపించాడు. దీంతో కొంత మంది ఫ్యాన్స్ హార్దిక్​ కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తే.. మరికొందరేమో అతడిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్య గాయపడటం వల్లే భారత్ ఈ స్థాయిలో విజయాలు సాధిస్తోందని.. హార్దిక్ స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతాలు చేస్తుండటమే దీనికి కారణమని అంటున్నారు. అందుకే తాను గాయపడి షమీ ఆడేందుకు అవకాశం కల్పించిన హార్దిక్​కు అభిమానులు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. కొందరైతే హార్దిక్​ను 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.

బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ్ హార్దిక్.. వరల్డ్ కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అప్పటి వరకూ జట్టులో లేని షమీ..హార్దిక్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఇక వస్తూనే 5 వికెట్లతో అదరగొట్టిన షమీ.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మినహా.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో చెలరేగి.. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఏడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనే షమీ 23 వికెట్లు తీశాడు.

కెరీర్​ ముగిసింది అనుకున్న వేళ - కష్టాలనే అవకాశాలుగా మలుచుకుని - షమీ కెరీర్​లో ఎన్నో మలుపులు!

వరల్డ్​ కప్​ 2023 - 'హార్దిక్​ ప్లేస్​లో ప్రసిద్ధ్​ను అందుకే తీసుకున్నాం'

ABOUT THE AUTHOR

...view details