తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం బాగా శ్రమిస్తున్నా.. కానీ నా లక్ష్యం అదే: హార్దిక్​

Hardik Pandya T20 Worldcup: టీ20 వరల్డ్​కప్​లో అద్భుత ప్రదర్శన చేసి టీమ్​ఇండియాకు విజయాన్ని అందించడమే తన లక్ష్యమని చెప్పాడు ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ఈ మెగాటోర్నీకి ముందు ఐపీఎల్​, తనకు ట్రైనింగ్​ ప్లాట్​ఫామ్​లా బాగా ఉపయోగపడుతుందని అన్నాడు.

Hardik Pandya T20 Worldcup
హార్దిక్​ పాండ్యా టీ20 ప్రపంచక్

By

Published : Jan 31, 2022, 9:01 AM IST

Hardik Pandya T20 Worldcup: టీ20 ప్రపంచ్​కప్​లో అద్భుతంగా రాణించడమే తన లక్ష్యమని చెప్పాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. దాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ప్రాక్టీసు చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవలే అతడు.. ఐపీఎల్​ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న అహ్మదాబాద్​ జట్టుకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే 'ఐపీఎల్​ 2022 కోసం ఎలా సన్నద్ధమవుతున్నారు' అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చాడు. ఈ వరల్డ్​కప్​ ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్​ 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.

"ప్రపంచకప్​లో అద్భుత ప్రదర్శన చేయడమే నా లక్ష్యం. ఈ మెగాటోర్నీని దష్టిలో ఉంచుకుని ప్రణాళికబద్ధంగా సన్నద్ధమవుతున్నాను. బాగా శిక్షణ చేస్తున్నా. దేశానికి విజయాన్ని అందించాలి. అది నన్ను గర్వంగా భావించేలా చేస్తుంది. సంతోషాన్నిస్తుంది. ఈ ఐపీఎల్​.. మెగాటోర్నీకి ముందు మంచి శిక్షణగా ఉపయోగపడుతుంది. వరల్డ్​కప్​లో టీమ్​ఇండియా విజయం సాధించడానికే నేను కష్టపడుతున్నా"

-హార్దిక్​ పాండ్య, టీమ్​ఇండియా ఆల్​రౌండర్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ.. తన కెరీర్​పై మహీ ఎంతో ప్రభావం చూపాడని ఇటీవలే హార్దిక్​ అన్నాడు. అతడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు.

2019 వెన్నుముక శస్త్రచికిత్స తర్వాత ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు హార్దిక్. ఐపీఎల్​ 2021, టీ ప్రపంచకప్​ 2021లో పేలవ ప్రదర్శన చేసి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ తిరిగి ఫామ్​లోకి వచ్చి ఆల్​రౌండర్​గా నిరూపించుకునేందుకు తాను తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'మహీ చాలా స్వేచ్ఛనిచ్చాడు.. నన్ను గొప్పగా తీర్చిదిద్దాడు'

ABOUT THE AUTHOR

...view details