తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ క్రికెటర్ నోట లంక జాతీయ గీతం - లంక జాతీయ గీతం

లంకతో తొలి టీ20లో ఆసక్తికర సంఘటన జరిగింది. భారత క్రికెటర్ ప్రత్యర్థి జట్టు జాతీయ గీతాన్ని పాడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది.

Hardik Pandya singing Sri Lankan national anthem during 1st T20
హార్దిక్ పాండ్య

By

Published : Jul 26, 2021, 1:12 PM IST

క్రికెట్​ మ్యాచ్​ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపించడం మాములే. అయితే ప్రత్యర్థి జట్టు గీతాన్ని పాడడం ఇంతవరకు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అయితే శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హర్దిక్ పాండ్య లంక జాతీయ గీతాన్ని పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటికే వన్డే సిరీస్​ను 2-1తో కైవసం చేసుకున్న ధావన్​ సేన.. పొట్టి సిరీస్​లోనూ శుభారంభం చేసింది. అయితే ఆల్​రౌండర్​ హర్దిక్​ పాండ్య తొలి టీ20లో ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్​లో కేవలం 10 పరుగులే చేసి ఔటయ్యాడు. బౌలింగ్​లో రెండు ఓవర్లు వేసి, 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

థాంక్యూ హర్దిక్..

టీమ్ఇండియాతో తొలి టీ20లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేశాడు చమిక కరుణరత్నె. ఈ సందర్భంగా తన బ్యాట్​ను అతడికి బహుకరించాడు టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హర్దిక్ పాండ్య. దీనిపై పాండ్యకు ధన్యవాదాలు తెలిపాడు కరుణరత్నె.

"నా రోల్​ మోడల్​ పాండ్య నుంచి బ్యాట్​ను బహుమతిగా పొందడం గౌరవంగా భావిస్తున్నా. థాంక్యూ హర్దిక్​. మీరు గొప్ప వ్యక్తి. ఈ రోజును నేనప్పటికీ మర్చిపోలేను. మీకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది" అని కరుణరత్నె పేర్కొన్నాడు.

కరుణరత్నె తన అరంగేట్ర మ్యాచ్​లో ఒక వికెట్​ తీశాడు. ఓవర్లు కోటా పూర్తి చేసిన అతడు.. 34 పరుగులిచ్చాడు.

ఇదీ చదవండి:అతడు నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: ధావన్​

ABOUT THE AUTHOR

...view details