టీమ్‌ఇండియా పేస్ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్య గత ఐపీఎల్ సీజన్ నుంచి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంచి ప్రదర్శన చేస్తూ జట్టు విజయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మరీ ముఖ్యంగా టీ20ల్లో టీమ్‌ఇండియాకు కీలక ప్లేయర్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మిడిల్, డెత్ ఓవర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య అభిమానుల్లో స్ఫూర్తి నింపేలా ఓ వీడియోను తన ట్విటర్ వేదికగా షేర్ చేశాడు.
హార్దిక్ పాండ్య వీడియో వైరల్.. ఏం పోస్ట్ చేశాడంటే? - హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్
హార్దిక్ పాండ్య అభిమానుల్లో స్ఫూర్తి నింపేలా ఓ వీడియోను తన ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. దాన్ని మీరు చూసేయండి..
Etv Bharat
"ఈ జట్టు.. ఈ కుటుంబం. అందరికీ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచకప్ కోసం రక్తం.. చెమటను చిందించాం. కన్నీళ్లు.. ప్రతిదీ అనుభవించాం. ప్రతి అడుగును కౌంట్ చేసేందుకు సిద్ధం" అని బ్యాటింగ్, బౌలింగ్, ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను పోస్టు పెట్టాడు.
ఇదీ చూడండి:ఊర్వశిరౌతేలాపై చాహల్ భార్య ఫన్నీ పోస్ట్.. అందుకే పెట్టిందా?