ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చేస్తోన్న టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యాపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా ఫామ్‌లో లేడన్న సన్నీ.. అతని స్థానంలో ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల పేర్లను సూచించాడు. గాయం అయిన దగ్గరి నుంచి హార్దిక్ అంతగా రాణించట్లేదని పేర్కొన్నాడు.
"అవును, హర్దిక్‌కు ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. పొట్టి ప్రపంచకప్‌కు ముందు మీరు అతనొక్కడినే పరిగణలోకి తీసుకుంటున్నారు. దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ అతడి స్థానాన్ని భర్తీ చేయగలరు. వీరిద్దరూ ఆల్‌రౌండర్లే. దీపక్ ఇటీవల రెండో వన్డేలో తనను తాను నిరూపించుకున్నాడు. భువీ కూడా మూడేళ్ల క్రితం లంకతో మ్యాచ్‌లో ధోనీతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడు కూడా అదే దీపక్- భువీ జోడీ నాటి ఘటనను పునరావృతం చేసింది."