Hardik Pandya IPL : టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు టీ20కి కూడా దూరమయ్యాడు. అయితే రానున్న ఐపీఎల్‌కు సన్నద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్‌లో ఉన్న హార్దిక్.. తిరిగి ముంబయి గూటికి చేరనున్నాడా? గుజరాత్ జట్టు సారథ్యాన్ని అతడు వదులుకోవడానికి సిద్ధమయ్యాడా? తొలి సీజన్‌లో తమకు ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్ కూడా అంగీకరించిందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై అటు గుజరాత్ టైటాన్స్ గానీ.. ఇటు ముంబయి ఇండియన్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ఆటగాళ్లను మార్చుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఆదివారం వరకు సమయం ఉంది. అప్పటివరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేనట్లే అని అనిపిస్తోంది. ఇక పాండ్య ఏడేళ్ల పాటు ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. 2022 సీజన్ ముందు ముంబయి అతడ్ని వదులుకోగా.. గుజరాత్ జట్టు హార్దిక్‌ను సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక హార్దిక్ సారథ్యంలో వరుసగా రెండేళ్లు గుజరాత్ ఫైనల్స్‌కు చేరింది. తొలి ఏడాది టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఈ ఏడాది చెన్నై చేతిలో ఘోర పరాజయంపాలైంది. ఈ నేపథ్యంలోనే "హార్దిక్ ముంబయికి మారనున్న విషయంపై చర్చలు జరిగాయి. అయితే అతడు ఫ్రాంఛైజీ మారే అవకాశముంది. ఇంకా ఒప్పందం పూర్తికాలేదు" అని గుజరాత్ టైటాన్స్ వర్గాలు తెలిపాయి.